ఉగాది
ఉగాది తెలుగు సంవత్సరాది శోభకృత్ కి స్వాగతం చైత్రమాస ప్రారంభం శుభాలకు సంకేతం కావాలని తొలి మాసం నుండే శుభ ఫలితాలు కలగాలని కొత్త ఆశలు చిగురు కొమ్మల వలె వికసించాలని ఉత్సాహానికి ఊపిరిలా వసంతం పలకరించాలని అవకాశాల అంచులు చేరాలని తీపి కబుర్లు చేరవేయాలని అనుభూతుల వగరు చేదు కలగలుపులే ఉంటాయని కష్టసుఖాల కాలం ఎలా ఉన్నా కర్తవ్యం ఎప్పుడు బోధిస్తూనే ప్రకృతి వర్ణాల వలె జీవన రాగంలో ఆనందాలు పలకాలని షడ్రుచుల సమ్మేళనం వలె పాడిపంటలు వృద్ధి చెందాలని సమస్త లోకానికి శాంతి సౌఖ్యాలు కలగాలని అద్భుత యోగం అందుకుని శోభకృత్ సకలశుభాలను పంచుతూ నిత్య నూతనంగా సాగిపోవాలి ...... - జి జయ