ugadi poems

ఉగాది

ఉగాది

ఉగాది కాల చక్ర భ్రమణం గావించిన వేళ, కొత్త చిగుళ్ళతో వసంత మాసం ఆహ్వనించు వేళ, సుమ సౌరభాలతో ప్రకృతి వెల్లివిరిసిన వేళ, విలంబి నామధేయంతో వికసిస్తూ విరబూసినవేళ, కష్టాలు అన్నీ విడిచి కలతలు అన్నీ మరచి స్వాగతించుదాము ఈ వేళ ఆ... షడ్రురుచుల సమ్మేళనంతో ఈ విళంబి నామ ఉగాది హేళ ఇదిగో వచ్చింది మరో యుగాది సిరి సంపదలు మీ ఇంట వర్షించాలని, రాగ ద్వేషాలను దరికి రానీయక అమృత భాండంతో మీరు తుల తూగాలని, ఎన్నో వసంతాలు మీ మదిని తాకాలని కొంగ్రత్త ఆశలకు మీ వాకిలి నిండాలని, నింగిలోని చుక్కలన్ని మీ ముంగిటలో రంగ వల్లులై పెనవేసుకోవాలని, ఈ వసంతోత్సాహంలో నూతనోత్సాహంతో తీపి,చేదు,కారం,వగరు ఉప్పు,పులుపు కలయికలుగల జీవిత సారాన్ని చెప్పే షడ్రురుచుల సమ్మేళానాన్ని ఆస్వాదిస్తూ... తరతరాల బంధాలను కాపాడు కుంటూ, వృత్తిని, ప్రవృత్తిని గౌరవిస్తూ... మన తెలుగు ఖ్యాతిని అంతరించకుండా రేపటి తరానికి అంది ఇవ్వాలనే…
Read More

ఊగిసలాడే ఉగాది

ఊగిసలాడే ఉగాది

ఊగిసలాడే ఉగాది   ఏరువంకల, ఎడ్లబండ్ల వెక్కిళ్ళని మాన్పి అరిగిపోయిన అనుబంధాల్ని అతికించి అలసిపోయిన కాలాన్ని కళతో బతికించింది యుగానికి, ఉత్సవానికి ఆరంభమైనా వనాలకు వన్నెలద్దే వసంతమైనా మొక్కుబడి మనుషుల ఉత్తమ నటనలో ఊపిరిసలపని ఊగిసలాటలో ఊపిరాడని ఉగాది పండగ ఉత్సహాన్ని తేకపోతే దండగే కదా ఊపిరిలేని గాలిమనుషులకు ఉత్తమమైన నకిలీ మనసులకు పోలికలేని పోల్చుకోలేని మార్పుని అందించి ఆరంభమయ్యేదే అసలైన యుగాది, అదే ఉత్తమైన ఉగాది - భరద్వాజ్
Read More
ఉగాది

ఉగాది

ఉగాది తెలుగు సంవత్సరాది శోభకృత్ కి స్వాగతం చైత్రమాస ప్రారంభం శుభాలకు సంకేతం కావాలని తొలి మాసం నుండే శుభ ఫలితాలు కలగాలని కొత్త ఆశలు చిగురు కొమ్మల వలె వికసించాలని ఉత్సాహానికి ఊపిరిలా వసంతం పలకరించాలని అవకాశాల అంచులు చేరాలని తీపి కబుర్లు చేరవేయాలని అనుభూతుల వగరు చేదు కలగలుపులే ఉంటాయని కష్టసుఖాల కాలం ఎలా ఉన్నా కర్తవ్యం ఎప్పుడు బోధిస్తూనే ప్రకృతి వర్ణాల వలె జీవన రాగంలో ఆనందాలు పలకాలని షడ్రుచుల సమ్మేళనం వలె పాడిపంటలు వృద్ధి చెందాలని సమస్త లోకానికి శాంతి సౌఖ్యాలు కలగాలని అద్భుత యోగం అందుకుని శోభకృత్ సకలశుభాలను పంచుతూ నిత్య నూతనంగా సాగిపోవాలి ...... - జి జయ
Read More
తెలుగు సంవత్సరాది ఉగాది

తెలుగు సంవత్సరాది ఉగాది

తెలుగు సంవత్సరాది ఉగాది యుగ యుగాల ఉగాది... నూతన తెలుగు సంవత్సరాది ఉగాది.... మోసుకొస్తుంది ఆనందాల పునాది.... పంచాంగ శ్రవణాలతో... రాశి ఫలాల ఫలితాలతో... నిండైన పర్వదినం ఉగాది! ఆరు ఋతువులు... ఆరు రుచులు జీవితాలలో చవి చూపించే పసందైన పండుగ ఉగాది.... తియ్యదనం సంతోషానికి... చేదు దనం దుఃఖానికి... కారం కోపానికి... వగరు శాంతానికి.... ఉప్పు రోషానికి.... పులుపు పొగరుకి ప్రతీకలై... పెనవేసుకున్న అనుబంధాల తెలుగు పండగే ఉగాది.... వసంతములో ఆకులు చివురించి పువ్వులు పూసి... శైశవ దశను తెలుపుతుంది.. గ్రీష్మం లో పగలు శేగలు రేపి.... యవ్వన యుక్తులను చూపుతుంది... వర్ష ఋతువులా జీవితానికి కావాల్సిన శక్తికి సంకేతం ఇస్తుంది... హేమంతంలా మంచు కురిసే మమతలను నేర్పుతుంది... శరదృతువు లా చల్లని వెన్నెలలు కురిపిస్తుంది...... శిశిరంలో ఆకులు రాలుస్తూ.... జీవితానికి ముగింపు మరణం అని తెలుపుతూ జీవి జీవిత చక్రాన్ని ఆవిష్కరించే పర్వదినం ఉగాది.... యుగ యుగాల ఉగాది....…
Read More
మన పండగ

మన పండగ

మన పండగ మన ఉగాది తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడి చెబుతోంది మనకు జీవితమంటే, కష్టం, సుఖం, భయం ధైర్యం, బాధ, సంతోషం, కన్నీళ్లు, ఆనందభాష్పాల మిశ్రమమని సకారాత్మకతతో మన జీవితంలోని కష్టసుఖాల్ని అంగీకరించి పయనం ముందుకు సాగించాలని సందేశమిస్తుంది మన పండగ ఉగాది పండగ - భరద్వాజ్
Read More
ఉగాది ఊసులు

ఉగాది ఊసులు

ఉగాది ఊసులు 1 ఆ.వె ఉప్పు.తీపి.కారముపకారమును చేయు   చేదు.వగరు.పులుపు చేయు మేలు   ఏవి యెక్కువైన ఇక్కట్లు వచ్చును   మితము ఎప్పుడైన హితము గూర్చు 2 తే.గీ. కలిమి లేములు సంతోష కష్టసుఖము    లన్ని అడ్డంకుల మనిషి అధిగమించి    నీరస పడిపోకుండ యెదురు నిలువ వలెను    పారిపోకుండ నిలబడు ఫలితమిచ్చు 3 తే.గీ. పుట్టి నప్పటి నుండియు గిట్టువరకు    నరుని జీవిత మంతయు నాటకమ్ము    కష్ట సుఖములే గాకయు కలిమి లేము    లన్ని కలబోసి వచ్చును అందరకును - కోట
Read More