vasu aksharalipi

నా ప్రేమ

నా ప్రేమ మెలికలు తిరిగే పొగమంచు ని చలి కాలమందు. అమాయకంగా తల ఆడించే పుష్పాన్ని వసంతమందు. మైమరచి నృత్యం చేసే గాలిని వేసవినందు. అనుమతించవే నన్ను కుంచనై స్పృసించేదను నీ మృదువైన హస్థాలను. మెలికలు తిరుగుతూ, ఆడుతూ, నృత్యం చేస్తూ గీసెదనే నా ప్రేమ హృదయాన్ని. ఆది నీకు, నా బహుమానమే. నా ప్రేమ సందేశమే......! - వాసు
Read More

వైకల్యత

వైకల్యత నా, వైకల్యము స్వీయము. నాది, అలసట ఎరుగని ప్రయాణము. నింగి, నేల హద్దులై, ఆమె కొరకై నే చేసే ఈ ప్రయాణంలో, అందమైనవి నన్ను ఆకర్షించవు. ఆమెలో నే చూడాల్సినది వాస్తవికత. నా వైకల్యము స్వీయము. నేను అబద్ధానికి, గుడ్డి, మూగ, చెవిటిని. నీ నవ్వు, నీలోని నువ్వు ఒకటే అయితే అదే అద్భుతమైన అందమే సఖి........! నాది కాదే దీనికి వైకల్యత.........! - వాసు
Read More

సన్మార్గము

సన్మార్గము కోట్లకు పడగలెత్తితివా....! నీవు తొక్కిన మార్గము నిన్ను సన్మానించిన నది సన్మార్గమౌనా........! వేతనాలు ఇచ్చి పెత్తనాలు చేసిన అన్నం పెట్టినట్లు ఔనా...! నీవు త్రాగు నీట సువర్ణ భస్మమా.......! నా గుక్కెడు నీట స్వేదమా....! నాది, నడక లేని నడక కొలత లేని దూరం. ఆదే...... తుది జీవితాంతము. నాది సన్మార్గము............! - వాసు
Read More

జీవన ప్రయాణము

జీవన ప్రయాణము నీవు మోయు సుఖాలు ఉప్పు మూటలాయె. వాటిని దించిన తేలికౌను నీ జీవన ప్రయాణము. బరువులెత్తిన కష్టజీవి కళ్ళు నిదుర పుచ్చును వాడిని. నీవు సముద్రాన్ని తోడగా వొచ్చు ఉప్పటి స్వేదము తిరిగి దానికే వూటౌను కదరా.....................! కష్టించిన నిదురవొచ్చు మరి నీకేల దుఃఖము రా....! - వాసు
Read More

హృదయ చప్పుళ్ళు

హృదయ చప్పుళ్ళు నీవెక్కడున్నావో తెలియదే నాకు....! ఇది ఖచ్చితం. కొన్ని వేల మైళ్ల దూరంలో ఏదో ఒకచోట పెరుగుతున్నావు అందాలను మూటగడుతూ, నా కనులుగప్పి ..............! నీ హృదయ చప్పుళ్లను నేను వినగలను. పెద్ద ధ్వనులతో చేరునవి నన్ను. నా రెక్కలు విప్పి నీ హృదయ సవ్వడులకు లయబద్ధంగా తాండవం చేస్తాను............! ఎగిరెగిరి రావే. బంధించు నన్ను నీ ప్రేమ హస్తాలతో లేదా అస్త్రాలతో బిగుతుగా ...............! నా తాండవము ఆగును కదనే నువ్విట్లు చేసిన త్వరగా! - వాసు
Read More

ప్రేమ ఇతిహాసము

కాను నేను మూగ జీవిని. అవసరానికి విప్పెదను నా కంఠము.............! నా ప్రేమకి భాష్యం లేదులే...........! ఉదారమైన, నా చూపుల భావాలు చెప్పునునీకు ప్రేమ ఇతిహాసము! నా రాత, బాలేదులే ప్రియా.........! నీ చెవులకు చేరువాయె నీ హృదయము.........! వినికిడి కాదులే నా తీయని వేదన..................! చెవులకు అందనిదే ఆది.........! నీ హృదయం చేరదులే దాని యధాస్థలి.............! ఇక, ఈ జన్మకు ఇంతే.......! - వాసు
Read More

హృదయమా

హృదయమా ఓ, నా హిమ హృదయ మా, నీ మాదిరే, నా ప్రేమ స్వచ్ఛమైన శ్వేత వర్ణము తో కూడిన క్షీరము. నాకు, పట్టదులే నువ్వు నన్ను అశ్రద్ధ చేసినను. ఆది నన్ను మండించుతునే ఉండును నేను మరుగుతూనే ఉంటాను. ఆది పెంచును నా ఆయుష్షు. నన్నిలానే వదిలేయ్. సుఖముగా నుందు. నీవు నన్ను ఎట్లు చేరుదువో అనే వేదన నాది. తేనవైదువో, లవణమై చేరుదువో...............! వద్దు ప్రియా, నాకీ వ్యధ. - వాసు
Read More

రక్తదాత!!

రక్తదాత!! నేను చూశా, నేను చూశా, అడవి లో మానవీయతను. వేలచెట్లకి అన్నదాత సూర్యుడొక్కడే. వేలచెట్ల వెక్కిళ్లకు ఉదక దాత వరుణుడొక్కడే . నేను చూశా నేను చూశా అడవిలో మానవీయతను. భానుడవై వెలుగు తండ్రి. ఎండి మాడి బూడిద అవుతున్న మనిషిని నీ మనవీయాతతో బొట్టు , బొట్టు గా జీవం నింపు. ఓ, దైవాంశ శంభూత. నీతి :- వాస్తవాలు బహు కఠినం. ఫలితాలు బహు మధురం. - వాసు
Read More

గొప్ప వ్యక్తిత్వాలు

గొప్ప వ్యక్తిత్వాలు 1) గొప్ప వ్యక్తిత్వాలు ఎవరిలోనూ లేవు. 2) వ్యక్తిగత లబ్ది అందరి ధ్యేయం. 3) ఫలితంగా స్వార్ధం విలయతాండవం. 4) నేను మంచి వాడిని అనుకుంటే మనస్సుకి శాంతి. 5) నువ్వు ఇతరులకి సాయం చేయాలంటే వారిలో చెడు ఇట్టే కనిపిస్తుంది. 6) ఆపాత్రదానం నీవు మెచ్చే బహు గొప్ప పదం. నీతి :- ఇతరులకి చేయి అందించలేని నువ్వు చేతకాని చవటవి. - వాసు 
Read More