vasu poems

పరుగులే నా నడకలు

పరుగులే నా నడకలు నా పరుగు లాయే  నిత్య నడకలు. నిన్ను చేరగా నదే గమ్యం మాయే. ఈ భౌతిక, మానసిక పరుగు నన్ను మన్నించమని అడుగుట కై సఖి! నీ పైన నా తీక్షణ చూపులు మరలించెను నీవి గగనము వైపు. నా ప్రేమ బిందువులు కురిపించగ.. ఛత్రి మాటున దాచితివి నీ శిరమును. నా బాధ కన్నీరై కార, వర్షము దానిని తడుపు చుండెను. కాలం కలిసి రాలేదు లే! ఈ పరుగు నే ఆ పనులే  !   - వాసు
Read More

జీవి అంటే!

జీవి అంటే! మంచితనమే ఊపిరై శ్వాసించి, నీ దృష్టితో శాంతాన్ని వెదుకు, వాక్కులో శుద్ధి వెలువరుచు, నవ్వు ఆయుధం : సంహరించు పరుషం, చెయ్యి అందించు అందరికీ, చెయ్యి చాచకు ముందరికి, నీ అడుగులు వెనుక వారికి ఆదర్శము, , ఆరాటము లేదు విరామముగ సాగు, నీ బాటలో ముల్లుని తీసిన, ఫల బీజము నాటిన సమానము, నిన్ను అనుసరించిన నాకు అది ఆదర్శము, మరియు రాజమార్గము, ఇట్లుండిన నీవు సంఘజీవివి లేకుండిన నీవు సంఘర్షణ జీవివి. - వాసు
Read More