vasu writings

పరుగులే నా నడకలు

పరుగులే నా నడకలు నా పరుగు లాయే  నిత్య నడకలు. నిన్ను చేరగా నదే గమ్యం మాయే. ఈ భౌతిక, మానసిక పరుగు నన్ను మన్నించమని అడుగుట కై సఖి! నీ పైన నా తీక్షణ చూపులు మరలించెను నీవి గగనము వైపు. నా ప్రేమ బిందువులు కురిపించగ.. ఛత్రి మాటున దాచితివి నీ శిరమును. నా బాధ కన్నీరై కార, వర్షము దానిని తడుపు చుండెను. కాలం కలిసి రాలేదు లే! ఈ పరుగు నే ఆ పనులే  !   - వాసు
Read More

ఆరాధన

ఆరాధన అదో చిన్న గ్రామము. బొగ్గు పొయ్యిలపై వంట చేసే సాంప్రదాయము. అప్పటికింకా గ్యాస్ పరిచయం కాలేదు. అందుకే జనాలకి గాసిప్స్ ఆలవాటు కాలేదు. అలమరికలు లేకుండా మాట్లాడేసుకునేవారు. ఇప్పుడు మనకి ఆకాశం అంటే ఒక్కటే కాని ఉదయం పూట మాకు రెండు ఆకాశాలు దర్శనము ఇచ్చేవి. ఒకటి దైవికమైనది. రెండోది మానవికమైనది. ఉదయాన్నే కొన్ని వందల ఇండ్లలో వాకిట్లో బొగ్గు పొయ్యిలు పెట్టేవారు. మా చిన్నారి జీవితాలకి ఆ చిన్నారి ఆకాశం మాకు ఇప్పటికీ తీపి గుర్తుగా ఉండిపోయింది. మా తండ్రి గారిది ప్రభుత్వ ఉద్యోగం. వారు కేటాయించి ఇండ్లలోనే ఉండాలి. అన్ని ఒకే మాదిరిగా రైలు బోగీల్లా విచిత్రంగా కనబడేవి. నేను, నా తమ్ముడు జంట కవులం, చిలిపి చేష్టలకి చిరునామా మా ఇల్లు, కర్ర బిళ్ళ ఆడుతూ, రాయమల్లమ్మ అనే ఒక ఆవిడది గుండు పగలగొట్టాం. ఆమెదే అదృష్టమో ఈ సంఘటనకి ముందు రోజు గుండు కొట్టించుకుని…
Read More

ఈర్ష్యా భరిత ప్రేమ

ఈర్ష్యా భరిత ప్రేమ ఓ, వృక్షమా......! నీడ నిస్తివని నిక్కు పోమాకే. నీ నీడనున్నది నీకు ఎవరో తెల్సుటే? నా హృదయం ఉండెను నా పంజరం అందే. నీ చెంతనున్నది నా శ్వాసనే! గాలి ఊపుకి బరువైన ఎండినాకులు రాలు; భారమైన పూరేకులు దొర్లు ; నీ పై చేరిన మంచు బిందువులు ఆమె ని గుచ్చును కదే..! నీ దరినున్నది, నా బాహ్య హృదయమే. ఆది గాయపడునేమో? జాగురతే. - వాసు
Read More

రెక్కలొచ్చిన ఊహలు

రెక్కలొచ్చిన ఊహలు అందమా, నిను చూసినది మొదలు నీ ప్రతిమను నిలుప నిర్విరామ మాయెను నా కృషి. మసక కమ్మేనా, నా కళ్ళు లేదా నీవు పొగమంచు మాటునుంటివా ? ఎట్లు నిలుపగలను నీ ప్రతిమ ? అర్ధ రాతిరి లేస్తిని. భయము గొల్పెను నాకు రెక్కలొచ్చిన నా ఊహలు ఉండునో, ఎగురునో, నని ? కలలో గంటిని నిన్ను కారుమబ్బులు షికార్లు కొడుతుండగా, ఉరుములు, మెరుపుల కాంతిలో చెక్కితిని నీ శిల్పము. శిల్పి నైతిని అర్ధరాతిరి నా అనుభవ లేమి మరిచే ఒక గొడుగు నిల్ప నీ శిరస్సు పై. తడిసి ముద్దయితివి ఆరుబయట. ఓ, నా శిల్పమా, మన్నించుము ఈ నాటు ప్రేముకుడ్ని. - వాసు
Read More

ప్రాణం

ప్రాణం ప్రాణం అంటే తీపి ఉండును కదరా అందరికి. కన్న తల్లి ని చేర్చకురా ఈ జాబితా లోకి ! అమ్మకి ప్రాణం అంటే తనది కాదురా ! పురిటి నొప్పులు ఊపిరులు తీస్తుండగా ఊపిరులు పోసుకున్న నువ్వురా, ఆమె ప్రాణం. కంట్లో పడిన నలుసు క్షణ కాలం కవ్వించునురా. నీ అసహనాన్ని ఎరుపెక్కిన నీ కళ్ళు చూపునురా చెప్పకనే ---! కడుపులో పడిన నలుసు కవ్వించునురా, ఆఁ తల్లిని, నవమాసాలు. ముసి, ముసిగా మురుస్తున్న ఆఁ కళ్ళ సహనం నీ కొరకేరా ! అది నిలుచునురా ఆఁ తల్లి కడదాకా ! - వాసు
Read More