vasu

నా ప్రేమ

నా ప్రేమ మెలికలు తిరిగే పొగమంచు ని చలి కాలమందు. అమాయకంగా తల ఆడించే పుష్పాన్ని వసంతమందు. మైమరచి నృత్యం చేసే గాలిని వేసవినందు. అనుమతించవే నన్ను కుంచనై స్పృసించేదను నీ మృదువైన హస్థాలను. మెలికలు తిరుగుతూ, ఆడుతూ, నృత్యం చేస్తూ గీసెదనే నా ప్రేమ హృదయాన్ని. ఆది నీకు, నా బహుమానమే. నా ప్రేమ సందేశమే......! - వాసు
Read More

వైకల్యత

వైకల్యత నా, వైకల్యము స్వీయము. నాది, అలసట ఎరుగని ప్రయాణము. నింగి, నేల హద్దులై, ఆమె కొరకై నే చేసే ఈ ప్రయాణంలో, అందమైనవి నన్ను ఆకర్షించవు. ఆమెలో నే చూడాల్సినది వాస్తవికత. నా వైకల్యము స్వీయము. నేను అబద్ధానికి, గుడ్డి, మూగ, చెవిటిని. నీ నవ్వు, నీలోని నువ్వు ఒకటే అయితే అదే అద్భుతమైన అందమే సఖి........! నాది కాదే దీనికి వైకల్యత.........! - వాసు
Read More

సన్మార్గము

సన్మార్గము కోట్లకు పడగలెత్తితివా....! నీవు తొక్కిన మార్గము నిన్ను సన్మానించిన నది సన్మార్గమౌనా........! వేతనాలు ఇచ్చి పెత్తనాలు చేసిన అన్నం పెట్టినట్లు ఔనా...! నీవు త్రాగు నీట సువర్ణ భస్మమా.......! నా గుక్కెడు నీట స్వేదమా....! నాది, నడక లేని నడక కొలత లేని దూరం. ఆదే...... తుది జీవితాంతము. నాది సన్మార్గము............! - వాసు
Read More

జీవన ప్రయాణము

జీవన ప్రయాణము నీవు మోయు సుఖాలు ఉప్పు మూటలాయె. వాటిని దించిన తేలికౌను నీ జీవన ప్రయాణము. బరువులెత్తిన కష్టజీవి కళ్ళు నిదుర పుచ్చును వాడిని. నీవు సముద్రాన్ని తోడగా వొచ్చు ఉప్పటి స్వేదము తిరిగి దానికే వూటౌను కదరా.....................! కష్టించిన నిదురవొచ్చు మరి నీకేల దుఃఖము రా....! - వాసు
Read More

నా బుజ్జి

నా బుజ్జి నేనెవరో...... నీకు ఎరుక లేదే ...! ఓ, నా బుజ్జి...........! నేను వెచ్చని సూర్యకిరణాన్నయ్ నిన్ను తాకి సుర్రుమనిపిస్తా.....! నీవు ఆనంద డోలికల్లో పిండి పదార్థాలు వండుకునెదవే ఓ, నా బంగారు తల్లి.....! చల్లని గాలినై నీకు చామరలు పట్టేదనే. నీ ఉక్క పోత హడలి పారిపోవునే ఓ, నా లేత మొక్క........! వర్షపు చినుకునై నిను ముద్దాడుదునే. నీకు పరిమళాలతో ముఖమజ్జనమే నే ....! ఓ, నా చిట్టి దళమా.....! నిన్ను కదలనీకుండా ఒడిసి పట్టుకుంటా భూమాత వలె. తల్లి ప్రేమ దక్కునే నీకు ఓ, నా వజ్రపుమూట ...! నీ, అవసరం ఏట్లో అట్లే ఎత్తెద నా అవతారము. నేనెవరో నీకు ఎరుక లేదే...! ఓ, నా బుజ్జి...........! - వాసు
Read More

గతము గంభీరమాయె

గతము గంభీరమాయె గతాన్ని నెమరు వేయ మిగిలెనాకు కమ్మని అనుభూతులు. అందని ఐరావతము అందలాలెక్కించె. వరించునేమో వయ్యారి జీవితము అని వర్తమానము వగలు పోతుండె......! వెర్రి కుంకనై విహంగ పక్షినైతి......! తల దాచ గూడు కానరాకుండె. అలసిన కాళ్ళు నిలుప భూమి చెంత లేని చింత ఆయె ...........! వర్తమానము ఇట్లు గమ్మత్తాయె! గతము గంభీరమాయె! అవ్వునా గతము నా సొంతము.....! నిలకడ వొచ్చి మళ్ళీ నిల్చుందునేమో....! - వాసు
Read More

ముద్దులోలికే అందాలతో

ముద్దులోలికే అందాలతో అలవమాకు రెక్కల సవ్వడులు చేసి. నాకు తెలియనిదా, అవి ప్రకాశించును తీక్షణ కాంతులతో, ముద్దులోలికే అందాలతో! నా హృదయాన్ని దొంగవై దోచ ఇది కాదే నీకు సరి! చడులు మాని సుతిమెత్తని అడుగులతో. నను చేరి వేయవే నా హృదయానికి కన్నం....! - వాసు
Read More

అరణ్య రోదన

అరణ్య రోదన అరుగు కాళ్ళిచ్చె నాకు పిసరంత ఆనందం........! అడవులందు వినవచ్చె వెదికిన అరణ్య రోదన. నదీమ తల్లి ఆవిరై ఎండంగ రాలు కన్నీరు ఇంకె వరదలై.........! మూగ జీవలు మౌనం వీడి ఆర్తనాదాల నాదస్వరం తో లోక కళ్యాణం చేయుచుండె. జంతు కోటలని కొల్లగొట్టి మానవ మృగాలు సంచరించుచుండె. అరుగు కాళ్లిచ్చె నాకు పిసరంత ఆనందం........... విశ్రాంతి కోరి నా శరీరము కాస్త విశ్రమించె .......! వినవొచ్చె నాకు పసికందు కేరింతలు...! దొరికెనానందము ఇక విశ్రమించ..................! ఆనందం భాష్పాలు రంకెలేయ...........! విశ్వమంతయు మారుమ్రోగె...........! ఇట్లుందును, ఇట్లుందును ఇకపై దొరికె నాకు అనంద సామ్రాజ్యము.....! - వాసు
Read More

ముఖారవిందము

ముఖారవిందము సమాజము అద్దమై మెరవంగ, నిన్ను నీవు సరిదిద్దుకునే కాలము కాటి దిక్కు పోతుండె!. నీ ముఖారవిందము బృఖుటితమైన, ఇచ్చునా సమాజము నీకు చిరుమందహాసము! నీ ఊల గోలకి ఊలలే చేరును కదా.....! నీ వెక్కిరింతలకి పులకరించి, పలుకరించునే తిరిగి వెక్కిరింతలు. నీకు తెలియరానిదా.......! నీలో ని ఈ మార్పు. ప్రేమనిచ్చిన ప్రేమనే పొందుదువు కదరా................! నీ చిరునవ్వు సిరులౌట చిత్రమౌన? - వాసు
Read More