venkata bhanuprasad chalasani

అపరిమితమైన సంతోషం

అపరిమితమైన సంతోషం

అపరిమితమైన సంతోషం కొత్త ఇల్లు కొనాలని మోహన్ ప్లాన్ వేసాడు. పెళ్ళైన మొదటి సంవత్సరమే బ్యాంకు లోన్ తీసుకుని అపార్ట్మెంట్ కొనాలి అని అతని ఉద్దేశ్యం. భార్య కూడా అందుకు ఒప్పుకుంది. మొత్తానికి పేపర్ వర్క్ పూర్తి అయ్యింది. మంచి జీతం వచ్చే ఉద్యోగం అవటం వల్ల అతనికి తొందరగా హౌసింగ్ లోన్ సాంక్షన్ చేసారు బ్యాంకు వారు. భార్య కూడా ఉద్యోగస్తురాలే. ఆమె కూడా పెళ్ళికి ముందే కొంత డబ్బు వెనకేసింది. ఆ డబ్బు కూడా తన భర్తకు ఇచ్చి ఇంటికి వాడమని చెప్పింది. తనను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు మోహన్ కు ఆపలేని సంతోషం కలిగింది. జీవితంలో పెళ్ళి చేసుకోకూడదు అని అనుకున్న మోహన్ పెద్దల బలవంతం మీద పెళ్ళి చేసుకున్నాడు. అతను పెళ్ళంటే చాలా భయపడ్డాడు. అతను భయపడినట్లుగా ఏమీ జరగలేదు. అంతా మంచే జరిగింది. అనుకూలవతి అయిన భార్యా దొరికింది. తర్వాత కొన్ని సంవత్సరాలకే…
Read More
సంకల్ప బలం

సంకల్ప బలం

సంకల్ప బలం సంకల్పం బలం ఉంటే ఏమైనా సాధించవచ్చు. ఒక మామూలు టీలు అమ్మే మోడీ ఈ రోజు దేశ ప్రధానిగా అయ్యాడంటే దానికి కారణం ఆయన సంకల్ప బలం. అలాగే ఒక పేద మత్శ్చకారుల కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం గారు దేశ రాష్ట్రపతిగా అయ్యారంటే దానికి కారణం సంకల్ప బలం. ఇలా చెపుతూ పోతే ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చు. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మెగాస్టార్ అయిన సినీ హీరో చిరంజీవి ఎదుగుదలకు కారణం ఈ సంకల్ప బలమే. ఒక చిరుద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టిన అంబానీ ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్ధాపించారు. నేడు మన దేశ రాష్ట్రపతి కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక గొప్ప నేతగా ఎదిగింది సంకల్ప బలం వల్లనే. అంతదాకా ఎందుకు మీరు, నేను కూడా ఈ సంకల్ప బలం వల్లనే విజయాలు సాధిస్తాము. ఒక ఆశయం పెట్టుకుని దాని…
Read More
జగమంత కుటుంబం

జగమంత కుటుంబం

జగమంత కుటుంబం భూమి మీద ఉండే మనవులంతా ఒక్కటే, అందరూ కలసి మెలసి ఉండాలని అందరూ భావిస్తారు. రామనాధం కూడా ఇదివరకు అలాగే భావించేవాడు కానీ ఇప్పుడు కాదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్లో ఎడ్మిషన్ తీసుకొనేటప్పుడే మనం ఏ దేశమో వ్రాయాలి. అక్కడ మన మనసులో దేశాల వారీగా విభజన జరిగింది. ఆ తర్వాత మతం కూడా వ్రాయాలి కాబట్టి మన మనసులో మతాల పట్టింపు వచ్చింది. ఆ తర్వాత కాలేజీ చదువులు చదివేప్పుడు కూడా కులాల బట్టీ రిజర్వేషన్ల ప్రస్తావన ఉంది. తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేప్పుడు కూడా కుల ప్రస్తావన ఉంది. రాష్టాల వారిగా ఉద్యోగావకాశాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను చూసిన మన మనసుల్లో రాష్ట్రాల వారీగా విభజన జరిగిపోయింది. ఇలా దేశాలవారీగా, రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా ప్రజల మనసులో అంతరాలు ఉన్నప్పుడు వసుదైక కుటుంబం…
Read More
మహానగరంలో సామాన్యుడు

మహానగరంలో సామాన్యుడు

మహానగరంలో సామాన్యుడు హైదరాబాద్ మహానగరం దేశానికే తలమానికంగా ఉంది. అలాంటి ఈ నగరంలో ప్రతి నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మన రచయితల్లాగా ప్రశాంతంగా కధలు వ్రాసి ఆనందించే వారూ ఉంటారు. అలాగే ఇతరుల కుత్తుకలు కోసే కసాయిలూ ఉంటారు. అలాంటి కసాయే మన ఈ కధా నాయకుడు సాయిలు కూడా. డబ్బు ఇస్తే ఎలాంటి పని అయినా చేసే సాయిలు వ్యక్తిగతంగా మంచివాడే. ఈ సమాజం అతన్ని రౌడీగా మార్చింది. ఉదర పోషణార్ధం నగరానికి వచ్చిన సాయిలు మొదట్లో నోట్లో వేలుపెట్టినా కొరకలేనివాడు. అతనికి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఈ సమాజం అంటే సాయిలుకి కసి. ఆ కసి ఎలా తీర్చుకోవాలో తెలీక హింసా మార్గం వైపు తన అడుగులు వేసాడు. తొండ ముదిరితే  ఊసరవెల్లి అయినట్లు మొదట ఒక చిన్న రౌడీగా ఉండే సాయిలు తర్వాత ఒక పెద్ద డాన్ గా మారాడు. ఒకరోజు తన…
Read More