విభ్రాంతి
విభ్రాంతి ఏమండోయి శ్రీ వారు లేవండి నాధా, ఇంత పొద్దెక్కినా ఇలా పడుకుంటే ఎలా? అదీ పండగ రోజు మరి ఇంత సేపా....!? మాములు రోజుల్లో అనుకుంటే సరే అనుకుందును గాని లేవండి బాబు అంది విజయ దుప్పటి లాగుతూ. శేఖర్ అబ్బా విజ్జూ కాసేపు ఆగు అని అంటూనే తనని దుప్పట్లోకి లాగాడు. ఛి ఛి ఏమిటీ చిలిపి పనులు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి, అంతా స్థిరపడ్డాక, ఈ వయసులో ఇదేంటి సిగ్గు లేకుండా అంది విజయ, దుప్పటి తొలగించి, లేచి నిలబడింది. ఏమోయ్ అన్నీ అయిపోయాయా? ఏంటి అయిపోయింది, మహా అయితే పిల్లలు స్థిర పడ్డారు అంతే గానీ మనకు ఇంకా వయసేం అయిపోలేదు, నువ్వు ఊ అంటే ఇప్పటికీ పిల్లలను కనడానికి నేను సిద్దమే అన్నాడు లేచి కూర్చుంటూ... ఆ, ఆ మీరు అన్నిటికీ సిద్దమే, కాని మాకుండోద్దు ఓపిక, అయినా ఇప్పుడు కంటే లోకం నవ్వుతుంది,…