vishwanath

నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు (పాబ్లో నెరూడా: స్పానిష్ కవి) నువ్వు పర్యటించకపోతే, నువ్వు చదవకపోతే, నువ్వు జీవిత ధ్వనులను వినకపోతే, నిన్ను నువ్వు అభిమానించకపోతే, నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు నీ ఆత్మ గౌరవాన్ని నువ్వు చంపుకున్నప్పుడు, సహాయం చేసే చెయ్యి అందుకోనప్పుడు, నువ్వు మెల్లగా మరణించడం మొదలు పెడతావు నీ అలవాట్లకు నువ్వు బానిస అయినప్పుడు, అదే దారిలో రోజూ నడుస్తున్నప్పుడు, నువ్వు అలవాటుగా చేసే పని మార్చనప్పుడు, నువ్వు వివిధ రంగులు ధరించనప్పుడు, లేదా అపరిచయస్తులతో మాట్లాడనప్పుడు, నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు ఆవేశాన్నీ, ఆవేశం సృష్టించే అల్లకల్లోల భావాల్నీ, నీ కళ్ళను చెమ్మగిల్లేలా, నీ గుండె వేగంగా కొట్టుకునేటట్లు చేసే సంఘటనలనూ, నువ్వు తప్పించుకు తిరుగుతున్నప్పుడు, నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు నీ భద్రతను వదలి అనిశ్చితిలోకి నువ్వు అడుగు పెట్టనప్పుడు, నువ్వు ఒక కల వెనుక పరిగెట్టనప్పుడు, జీవితంలో కనీసం ఒక్కసారి, నువ్వు పరిగెట్టనప్పుడు...…
Read More

అవని

అవని భూమి, నేల, వసుమతి, పుడమి, ధరణి ఏవైనా నీకు పేర్లు అనేకం ఉండుగాక.... నీవు పకృతి సృష్టివై ముక్క గా విడి ,చల్లార్చబడి, అనంతకోటి జీవరాసులకు నిలయమై ఖండాలుగా విభజితమై ఉన్నావని..... నీవు మేము విశ్వసించే మత గ్రంధాలప్రకారం దైవం చే విశ్వంలో సృష్టించడి ఖండాలుగా విభజితమై జీవకోటి సంరక్షణిగా ఉన్నావని.... మనుషులు గా మేము నీ పై భిన్న అభిప్రాయాలు కలిగి నివశిస్తున్నది వాస్తవమని ఎరిగి,నీవు ఈ విశ్వంలో ఒక గ్రహమని వేల ఏళ్ల క్రితమే తెలుసుకుని , మాతోపాటు అనంతమైన జీవరాసులు కు నీవే ఆధారమని గ్రహించి జీవనం కొనసాగిస్తున్న తెలివైన జీవులం.... నీపై గలప్రకృతి ఒక జీవనగతి అందు విద్య, వైద్యం మేమందుకొని మనోవికాసులమై ,ఆరోగ్య వంతులమై, అందు అందచందాల అనుభూతి పొందుచూ, అందు అన్నిటి పై ఆదిపత్యం సాధించి,శోధించి ,ప్రకృతి సంపద కొల్లగొట్ట నారంభించి,దుష్ట ఆలోచనా పరులమై నీవందించి ప్రకృతి నాశనం చేయ, మేమే…
Read More

మనిషి

మనిషి నీవు సంఘ జీవివి నీ పాత్ర "మనీషి" లా ఉండాలి సమాజంలో.... కానీ! నీవుస్వార్థం నింపుకుని నాకుటుంబం ,భార్య ,పిల్లలు అంటూ కూడగట్టే పనిలో పడి, అవినీతి పరుడు గా మారి సమాజానికి భారంగా పీడకుడువైనావు.... అంతటితో నీవు ఆగవుగా అవినీతి సామ్రాజ్యకుడైన వెంటనే నీకుటుంబంతో పాటు నీకులం గుర్తుచేసుకుంటావు... సామాజిక జీవిగా విచ్ఛినకర ధోరణి మంచిది కాదని విస్మరిస్తవ్.... సమాజ ఐక్యతను విష్మరించి కులకుంపట్లు రాజేస్తావు..... అవినీతి సొమ్ము వెదజల్లి ఎదుటవారి పై దాడులతో విరగబడి పైచాసికాందాన్ని పొందుతున్నావ్..... ఇక నీకు మానసిక సమస్య ఉత్పన్నమై ,పాపభీతి తో కొట్టి మిట్టాడుతున్నావ్. వెంటనే మదిలో నీఆలోచనులు తొలగింపునకు మతం-దేవుడు ని ఎంచు కుంటావు. అచ్ఛట కూడా సక్రమంగా వ్యవహరించలేవు. కారణం నీవు స్వార్థం తో నిండిపోయావ్..... దేవుడు ని నీ కోర్కెలు తీర్చే యంత్రం గా మార్చేసావు. నీ భయం భీతి పోగొట్టుకొనుట కు ఏమీ కోరని దేవుణ్ణి…
Read More