womens day quotes

మహిళా శక్తి

మహిళా శక్తి

మహిళా శక్తి 1. ఆ.వె.  మహిళ చేతగాని పని లేదు వసుధలో  నేర్పు.ఓర్పు గలిగి నెలత చేయు  అలసటెరుగకుండు ఆలనా పాలనా  కన్న సంతు సమము కరుణ జూపు 2. ఆ.వె.  కష్ట కార్యములని కోమలుల కివ్వక  స్త్రీలు సున్నితులని చీత్కరించ   అట్టి పనుల జేసి అబలలం గామని  నిలిచి గెలిచి తెలిపె నేటి మహిళ 3. ఆ.వె.  అంతరిక్ష మంత అవలీలగా తిరిగి  రణము గెలిచి రమణి రాజ్యమేలె  రాజకీయ మందు రాణించె లేమలు  రాష్ట్రపతిగ " ప్రతిభ "రాణకెక్కె 4. ఆ.వె.  కదనరంగమందు.కడలి అంచుల యందు  పారిశుధ్యమందు.పాడియందు  సైన్యమందు.వైద్యసమయమందే కాక  ఇంటి పనులు పెక్కు.వంట వనితె 5. ఆ.వె.  ఆడజన్మ లేక అవని పూర్ణము గాదు  సృష్టి కార్యమెల్ల శూన్యమగును  ఏక చక్ర శకట మేరీతి సాగును  రమణి తోడు వున్న రక్ష మనకు - కోట
Read More
మగువ

మగువ

మగువ నిందించే సమాజం ఓ వైపు ప్రశ్నించే కుటుంబం ఓ వైపు నిత్యం భయపడే క్షణం ఓ వైపు క్షణం క్షణం నరకం ఓ వైపు రొజూ రోజుకు పెరిగి పోతున్న అన్యాయాలు ఓ వైపు పెరుగుతున్న మ్రగాళ్ళు ఓ వైపు కాకుళ్ళా పొడుస్తున్నా, తన హక్కుల కోసం ప్రతిరోజూ ప్రతి నిమిషం పోరాడుతూ తన ఉనికిని చాటాలని అనుకుంటున్న ఓ మహిళా నీకు రక్షణ ఎక్కడుందో ఎవరికి తెలుసు, ఇంట్లో, బయట, ఆఫీస్ లో ఎక్కడా రక్షణ లేకుండా నిమిషం నిమిషం నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీకు నువ్వే రక్షణగా ఉంటూ నీ ఉనికిని నువ్వే చాటుకునే ఆత్రంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పోరాడుతున్న మగువా అందుకో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకంక్షలు అందిస్తూ ఇకనైనా సమాజం మారాలని, ఇకనైనా చట్టాలు అనుకూలంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - భవ్య చారు
Read More