తగునా సఖియా!

తగునా సఖియా!

భావం తెలియని రెప్పలతో
అల్లార్చే కావ్యాలు రాస్తూ
కనుదోయి పలికే ఊసులు
చదవాలనుంది నా హృదయానికి

మూసిన కనులలోని కలల
రూపాన్ని నేనవ్వాలని
నాలో దాగిన కాంక్షల ఆకాంక్ష
తెలపాలనుంది నీపైన ప్రేమకి

లేత గులాబి పెదవులు కలిపి
తేనెల పలుకులు పలికే
అధరాలనడుగు చెబుతాయి
నీ పేరే జపమైనదని

అంధకారమలుముకున్నట్లు
దట్టంగా అల్లుకున్న కురులలో
నిశిలో శశిలా మెరిసే మల్లెలు
పరిమళాలను అడుగు నా యాతన

నా ప్రేమవు నీవని
నీ కలను నేననీ
తెలిసీ ఎడబాటుల విరహాన
నలిగిపోతూన్న అభాగ్యుడను

కరుణించి కనికరించవూ…
ప్రణయ సంగమ వేళకి తెరతీయవూ…
ఇలా పలుమార్లు తిప్పుకొనుట
నీకు తగునా సఖియా!

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts