తలంపు
నీ తలంపులో నేను ప్రతి క్షణం గడుపుతూ
నా మదిలో మెదిలే నీ రూపం తలుచుకుంటూ
నీ తలంపు నాకు మధురమైన జ్ఞాపకం
నీ జ్ఞాపకాల మడుగులో మునిగి తేలుతున్నా
నీతో గడిపిన ప్రతి క్షణం
నేను ఎప్పటికీ మరవలేను
నీ పేరు తలవని రోజే లేదు
నిన్ను వెతికినా నా హృదయం
నీ కోసం ఆరాటం పడే ప్రతి క్షణం
నా ఎదురు చూపు నువ్వు ఎప్పుడు వస్తావనో
కానీ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు
ప్రతి క్షణం నీ జ్ఞాపకాల మడుగులో లోనవుతున్నా
ఎటు చూసినా నువ్వే కనిపిస్తూ
నన్ను బాధకి కారణం అవుతున్నావు
ఒకప్పుడు నీ తలంపు ఒక వరం అనుకున్నా
కానీ ఇప్పుడు మాత్రం నా కన్నీళ్ళకి కారణం నువ్వే..
-మాధవి కాళ్ల