తలపుల్లో

తలపుల్లో

కాలం ఒక్కసారిగా వెనక్కి మళ్ళిన క్షణాన…
పరిచయపుటల్లో జ్ఞాపకాల సందళ్ళు మొదలు…
అల్లరి చేస్తూ ఆదమరచి గడపిన రోజులు…
యాతనలెరుగక నవ్వులతో కరిగిన కాలగతులు…

వెనువెంట మనసంతా మధురోహాల స్మృతులు నిండిపోవగా…
పరిచయపుటల్లో జ్ఞాపకాల సందళ్ళు మొదలు…
హద్దులెరుగని చెలిమిలో గడిచిన క్షణాలు…
వీడిమనలేని ఎదతడిలోని సంబరాలు…..

ఎన్నని చెప్పినా తరగని గనివంటి నిధులు…
మాటే వినని అల్లరి తుంటరులు…
వెంటపడి వెంటపడి వేధించిన ఆ రోజులు…
పెదవంచున దగిన ముసిముసి నవ్వుల సిగ్గు మొగ్గలు…

ఎంత చెప్పినా నేటికీ చెదరని చెరగని అనుభూతలు…
పెరిగే వయసుకి నిండే ప్రాయానికి…
మౌనం వీడిన పదాల జాతరలు….
తరగని అలనాటి మధురోహల చిత్తరువుల చిద్విలాసములు…

ఎవరెటు వెళ్ళినా గురుతుగా మిగిలిన దొంతరలు…
కాలగమనంలో కనుమరుగవ్వని గ్రంధాలు…
కసిరేకాలంలో ముసిరిన చీకట్లలో…
దిక్సూచై దారిచూపు తలపుల్లో దాగిన స్నేహ హస్తాల వీచికలు…

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts