టాలెంట్
ఏమండీ నేను టిక్ టాక్ లో వీడియోలు చెయ్యాలని అనుకుంటున్నా. చెయ్యనా అండి అంటూ భర్తను అడిగింది లహరి. ఎందుకు లహరి? హాయిగా ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటే బాగుంటుంది కదా దాని బదులు ఏదైనా కథలో, కవితలో రాయవచ్చు కదా అన్నాడు అరుణ్.
హా అబ్బా అది కాదండీ పక్కింటి కరుణకు ఎంతో మంది ఫాలోవర్స్, లైక్స్ వస్తున్నాయి అది నాకు చూపిస్తూ ఎంత ఫోజు కొడుతుందనుకున్నారు.
నేను చేస్తాను అండి చిన్నప్పటి నుండి డాన్స్ అంటే నాకు ఇష్టం అండి, ఇన్నాళ్లు చేయలేక పోయాను, ఇప్పుడు నన్ను చెయ్యనివ్వండి. ఎలాగూ పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు కదా, అంటూ గారాలు పోతున్న భార్యను బాధ పెట్టలేక, సరే నీ ఇష్టం కానీ, జాగ్రత్తగా ఉండు అన్నాడు అరుణ్.
సరే అండి మీరు ఒప్పుకున్నారు నాకు అది చాలు అంటూ అరుణ్ ను ముద్దుల్లో ముంచింది లహరి.
ఇక తెల్లారి నుండి మొదలు పెట్టింది వంట, టిఫిన్ చేసి, పక్కన పెట్టేసి తన గది లోకి వెళ్లి తలుపులు వేసుకుని మంచిగా అందంగా రెడీ అయ్యి, వీడియోలు తీస్తూనే ఉంది, పోస్ట్ చేస్తూనే ఉంది. పిల్లలు ఆకలి అంటూ అరిచినా పెట్టుకుని తినండి అంటూ వాళ్లను కసిరి తన పనిలో మునిగిపోయింది.
అలా రోజూ గంటలు గంటలు వీడియోలు చేస్తూ నిమిషానికో సారీ లైక్స్ ఎన్ని వచ్చాయి, ఫాలోవర్స్ ఎందరు పెరిగారు అని అనుకుంటూ ఫోన్ను ఒక్క క్షణం కూడ వదలకుండా పట్టుకునే ఉంటుంది లహరి.
తనకు వస్తున్న ఫాలోవర్స్ ను చూస్తూ ఆనంద పడుతూ తనకి కామెంట్స్ పెడుతున్న వాళ్లకు రిప్లైలు ఇస్తూ ఎంతో సంతోషపడుతూ గొప్పగా ఫీల్ అవుతుంది. చుట్టాలు, స్నేహితులు, బంధువులు, రోజూ ఫోన్ లు చేసి మెచ్చుకుంటూ ఉంటే అరుణ్కు కూడా కొంచం గర్వంగా అనిపించింది.
ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు గుర్తుపట్టని తనను లహరి గారి భర్త గారు అంటూ జనాలు గుర్తుపట్టడం చూసి గర్వంగా అనిపిస్తూ ఉంది.
కొన్నాళ్ళు బాగానే ఉంది టిక్ టాక్ లో గ్రూప్ ఫాం అయ్యింది. వీడియోలు చేసేవారంతా కలిసి ఒక గ్రూప్ అయ్యారు రోజూ చాటింగ్ చేయడం ఏం వీడియోలు చేయాలో మేకప్ ఎలా వేసుకోవాలి అనేది మాట్లాడుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ ఉండేవాళ్లు ఆ గ్రూప్ లో.
మన లహరి కూడా ఉంది ఆ వాట్సప్ గ్రూప్ లో రాత్రనకా పగలనకా వందల మెసేజ్ లు వచ్చేవి.
అందులో మగవాళ్ళు కూడా ఉండేవాళ్లు కాబట్టి లహరి గారు, మీరు సూపర్, మీరు బాగా చేస్తారు, డాన్స్ ఇరగదీశారు అంటూ ఎన్నో పొగడ్తలు రావడం చూసి లహరి ఆనందానికి అవధులు లేవు. కానీ, ఈ టిక్ టాక్ మోజులో పడి లహరి ఇంటిని, పిల్లలను పట్టించుకోవడం మానేసింది.
టాలెంట్
దాంతో, అరుణ్ కి కోపం వచ్చి ఒక రోజు తనతో ఏంటి లహరి ఇది ఏదో చేయమని అన్నాను. కానీ, ఇలా పిల్లలను పట్టించుకోకుండా ఉండడం పద్దతి కాదు వాళ్లకు నువ్వు సరిగ్గా వండి పెట్టీ ఎన్ని రోజులు అయ్యింది తెలుసా?
కనీసం నన్ను కూడా పట్టించుకోవడం లేదు నువ్వు అంటూ కోపానికి వస్తున్న భర్తను చూస్తూ లహరి నేను పేరు తెచ్చుకోవడం మీకు ఇష్టం లేదు.
నాకు పేరు రావడం మీరు భరించలేకపోతున్నారు. నా టాలెంట్ ను అణగద్రొక్కాలని చూస్తున్నారు.
నాకు పేరు వస్తుంటే మీరు కుళ్ళుకుంటున్నారు అంటూ ఇంతెత్తున లేవడం చూసి అరుణ్ పిల్లల ముందు గొడవ పడడం ఇష్టం లేక లహరి మూర్ఖత్వంతో వాధించలేక నోరు మూసుకున్నాడు.
దాంతో,ఇక లహరి రెచ్చిపోయింది నన్నే ఇంత మాటలు అంటారా నా మానాన నేను వీడియోలు చేసుకుంటే నన్ను చులకనగా చూస్తారా? నన్ను బంధించాలని అనుకుంటున్నారా ? నేను ఇంట్లోనే ఉండను అంటూ అప్పటికప్పుడు వెళ్ళిపోవడానికి రెడీ అయ్యింది.
కానీ, అరుణ్ మాత్రం ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ జీవితం పాడవుతుంది అని ఆలోచించి, లహరి వద్దు లహరి నువ్వేం చెప్పినా వింటాను నువ్వు మాత్రం బయటకు వెళ్లకు అంటూ బతిమాలడంతో, అయితే నేను చెప్పేది వినండి టిక్ టాక్ లో ఒక వ్యక్తి షార్ట్ ఫిల్మ్ లో నాకు అవకాశం వచ్చింది.
నేను ఒక పదిరోజులు షూటింగ్ కోసం వెళ్లాలి, దానికి మీరు ఒప్పుకోవాలి అని అంది.
విషయం తెలిసి ఆశ్చర్య పోయాడు అరుణ్ తన భార్యకు షార్ట్ ఫిల్మ్ లో నటించే అవకాశం వచ్చిందా తన భార్యలో అంత టాలెంట్ ఉందా అని అనుకుంటూ లహరి సరే ఒప్పుకుంటున్నారు మనం బాగుపడితే మనకు పలుకుబడి పెరుగుతుంది సెలబ్రిటీలు అవ్వచ్చు కదా కంగ్రాట్స్ అంటూ సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దానికి లహరి అవును.
కానీ, ఇప్పుడే ఈ విషయం ఎవరికీ చెప్పకండి షూటింగ్ అయ్యి రిలీజ్ అయ్యాక అందులో నన్ను చూసి అందరూ ఆశ్చర్య పోవాలి సరేనా, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను అని చెప్పండి అందరికీ, అంటూ అరుణ్ కు చెప్పింది.
సరే నువ్వు ఇంత ఇదిగా చెప్పాలా ఏంటి నేను చూసుకుంటాలే కానీ, నువ్వు క్షేమంగా వెళ్లి లాభంగా రా అంటూ దగ్గరుండి మరి బస్ ఎక్కించాడు లహరిని అరుణ్ .
లహరి వాట్స్ అప్ గ్రూప్ లో ఒక వ్యక్తి తన నటన డాన్స్ చూసి నేను షార్ట్ ఫిల్మ్ లు తీయాలి అనుకుంటున్నా అందులో మీకు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాను చేస్తారా అంటూ అడిగాడు.
దాంతో, లహరి క్షణం కూడా ఆలోచించకుండా అలాగే అండి అంటూ ఒప్పుకుంది. దానికి అతను మీరు ఫలానా ఊరికి ఈ టైంకు రావాలి ఒక పది రోజులు షూట్ ఉంటుంది అంటూ చెప్పాడు.
టాలెంట్
అతను కొంచం పేరున్న వ్యక్తి కావడంతో లహరి ఎగిరి గంతేసి అరుణ్ తో చెప్పి ఇప్పుడు వెళ్ళింది. అరుణ్ కూడా ఎవరికీ రాని అవకాశం తన భార్యకు వచ్చేసరికి చాలా ఆనందపడిపోయాడు .
ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎలాంటి వాళ్లకు అయినా పేరు తెచ్చుకుని సెలబ్రిటీలు కావాలని రాత్రికి రాత్రి స్టార్స్ కావాలని కలలు కనడం సహజం. ఇలా అవకాశం రావడంతో దాన్ని అందుకోవాలని ఇలా వెనక ముందు ఆలోచించక లహరి వెళ్ళింది.
బస్ దిగిన లహరి దగ్గరకి కారుతో వచ్చిన ఒకడు ఎదురుగా వచ్చి మీరేనా లహరి మేడం అంటు అడిగాడు అవును నేనే అనగానే సార్ పంపారు రండి అంటూ కారు చూపించాడు.
దాంతో, లహరి కారు ఎక్కింది ఊరికి దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌజ్ లోకి కారు దూసుకు వెళ్ళింది అక్కడ చాలా నిర్మానుష్య ప్రదేశంగా ఉంది ఎవరు లేరు, కారు ఆపగానే లోపలికి వెళ్ళండి మేడం అన్నాడు డ్రైవర్ ,లహరి లోనికి వెళ్ళింది ఒకతను ఎదురు వచ్చి అయియే మేడం జీ, ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించాడు.
హా బాగా అయ్యింది అనగానే రండి ఫ్రెష్ అవ్వండి అంటూ రూమ్ చూపించాడు. లహరి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చింది. ఇక తాను వచ్చేసరికి ఆ వ్యక్తితో పాటూ ఇంకో నలుగురు వ్యక్తులు కూడా కనిపించారు.
అతనితో వీళ్లంతా మన ప్రొడ్యూసర్ లు వీళ్లను మంచి చేసుకోండి అంటూ వాళ్లను పరిచయం చేయించాడు మంచి అంటే పరిచయం కాబోలు అనుకుంది లహరి.
అందరికీ నమస్కారం చేసింది అందరూ నవ్వుతూ నమస్కరించారు ఇక పార్టీ స్టార్ట్ అయ్యింది అక్కడున్న అందరూ మగవాళ్ళే, తను ఒక్కతే ఆడపిల్ల అని గుర్తించి మిగిలిన వాళ్ళు రాలేదా అంటూ అడిగింది లహరి.
రేపు జాయిన్ అవుతారు మీకేం భయం లేదు డ్రింక్ తీసుకోండి అంటూ కూల్ డ్రింక్ ఇచ్చాడు అతను, లహరి మనసులో భయంగా ఉన్నా పైకి మాత్రం గుంభనగానే ఉంది.
డ్రింక్ తాగింది కొంచం తాగగానే అందులో జిన్ కలిపారు అని గుర్తించింది మత్తు తలకు ఎక్కింది ఇంతలో అందులోని ఒకడు వచ్చి కామన్ డ్యాన్స్ అంటూ లహరి చేయి పట్టుకున్నాడు లహరి విడిపించుకుని పోవాలి అనుకుంది.
కానీ, అంతలోనే మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది కామన్ డాన్స్ అంటూ తల ఒకరు, చేయి, నడుము, షోల్డర్ పట్టుకుంటూ లహరిని ఊపేస్తునారు లహరికి మత్తు తలకు ఎక్కుతుంది. వాళ్ళ చేతులను తోసెయ్యలని చాలా ప్రయత్నించింది ,కానీ తన బలం సరిపోలేదు ఇక తన చీర లాగేసారు.
జాకెట్ ఎటో పోయింది బ్రా, పెట్టికొట్ మిగిలింది అలా వాళ్లు డాన్స్ చెయ్యి అంటూ తనను తిప్పుతూ, గిల్లుతూ, రక్కుతూ, తమ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ లహారిని ఎంతో చిత్రహింసలు పెట్టారు.
ఆ రాత్రి పదిమంది మీద పడ్డారు అదంతా ఆ వ్యక్తి కెమెరాల్లో షూట్ చేయడం అంతా మత్తులోనే గమనించింది లహరి కళ్ళు మూతలు పడుతున్నాయి ఏదేదో అయిపోతుంది.
వాళ్ళు ఏదో చేస్తున్నారు తనను, తన భర్త మొదట చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి, వద్దు లహరి ఇలాంటివి మనకు ఎందుకు చెప్పు కథలు, కవితలు రాసుకోవచ్చు కదా అని ఎంతో బాగా చెప్పాడు.
కానీ, తను వినలేదుగా ఇప్పుడు అనుభవిస్తుంది పది రోజుల తర్వాత లహరి ఇంకా రాకపోవడంతో అరుణ్ వెతుక్కుంటూ వెళ్ళాడు కానీ, అక్కడ లహరి అచేతనంగా నిర్జీవంగా పడి ఉంది.
టాలెంట్
అది చూసి అరుణ్ కు ఒక్కసారిగా వెన్నులోంచి వణుకు పుట్టింది తను లహరి ని ఏదో అనేలోపు ఏవండీ, ఏవండీ మీరు చెప్పింది వినకుండా అందని ద్రాక్ష ను అందుకోవాలని అనుకున్నాను, ఇలా నా జీవితం నాశనం అయ్యింది అంటూ ఏడ్చింది లహరి ఎంత ఏడిస్తే ఏం లాభం అయ్యిందేదో అయిపోయింది పద వెళ్దాం అంటూ భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు అరుణ్.
అయితే పక్కింట్లో పరిస్థితి ఘోరంగా ఉంది ఇంటి చుట్టూ పోలీసులు జనాలు గుమ్మి గూడి కనిపించారు ఏమైందని అడిగిన అరుణ్ కు వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే పంకజం కూడా టిక్ టాక్లో వీడియోలు చేసేది దాన్ని అలుసుగా తీసుకుని అభిమాని అంటూ ఎవడో పరిచయం పెంచుకున్నాడు.
వాడి మాయలో పడిన పంకజం భర్తను చంపి, వాడితో వెళ్ళాలని అనుకుంది అంట భర్త ఇంట్లో ఉండగా ఎవరూ లేని సమయంలో మత్తు మాత్రల ఇచ్చి పడుకోబెట్టింది.
ఆ తర్వాత వాడికి ఫోన్ చేస్తే వాడు వచ్చి పంకజాన్ని కొట్టి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు ఇదంతా మత్తులోనుంచి బయటకు వచ్చిన భర్త చూసి కోపంతో భార్యను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
దాంతో, అనుమానం వచ్చిన పొరుగు వాళ్ళు పోలీసులకు చెప్పడం వల్ల ఇప్పుడు పోలీసులు వచ్చారు ఆ దంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు కాని ఇప్పుడు తల్లిదండ్రులు లేని అనాధలు అయ్యారు.
ఈ విషయం తెలిసిన అరుణ్ గుండెల్లో రాయి పడింది తన భార్య వీడియో తీసిన వాడు మళ్లీ నెట్ లో అప్లోడ్ చేయడు అని నమ్మకం లేదు అప్పుడు పిల్లలు తన భార్య అందరూ తట్టుకోలేరు అప్పుడు అందరూ చావవలసిందే అని అనుకుంటూ లహరి మొహంలోకి చూసాడు అరుణ్.
లహరి తల దించుకుని చిన్నగా తల ఊపింది ,తెల్లారి పాల అతను డోర్ కొట్టినా తియ్యకపోవడం చూసి పొరుగున ఉన్న వాళ్ళు కిటికీ లోంచి చూసేసరికి నాలుగు శవాలు వేళాడుతూ ఉన్నాయి…
టాలెంట్ అనేది ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలి? ఎందుకు ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి , పక్కింటి ఆవిడ లైక్స్, ఫాలోవర్స్ వస్తున్నారని తాను కూడా అలాగే రావాలని అనుకోవడం తప్పు.
అలాగే గ్రూప్ లో ఉండి ఎవరు ఎలాంటి వారో తెలియకుండా వాళ్ళు చెప్పింది నమ్మి వెళ్లడం ఇంకో తప్పు. పరిచయం అయిన వాడిని ప్రేమించి కట్టుకున్న భర్తను ఇన్నేళ్ల కాపురాన్ని కూలదోసుకోడం భర్తను మోసం చేయాలనుకోవడం ఇంకొక తప్పు.
పంకజం తానే మోసపోయి చివరికి ప్రాణాలు కోల్పోయింది ఇలాంటి యాప్ ల వల్ల కొన్నే మంచి పనులు అవుతాయి మిగతా అన్ని ఇదిగో ఇలాగే అవుతాయి.
ఇప్పుడు రెండు కుటుంబాలు నాశనం అయ్యాయి ఆరు ప్రాణాలు గాల్లో కలిశాయి,ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు టాలెంట్ ఉన్నా అదృష్టం కూడా ఎంతో కొంత కలిసి రావాలి.
రాత్రికి, రాత్రే సెలబ్రిటీలు అవ్వాలని మీ కన్న వారిని, కట్టుకున్న వారిని వదలకండి మోసం చేయకండి, లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం బట్టలు విప్పి బజార్లో నిలబడి మీ మాన ప్రాణాలు పోగొట్టుకోకండి…
ఇది కల్పిత కథ, ఎవ్వరిని ఉద్దేశించి రాసింది కాదు.
–ఉదయశ్రీ