తల్లి

తల్లి

కన్నతల్లిని వున్న ఊరిని మరచినవాడు
మరుజన్మలో రాక్షసుడిగా పుడతారు అని పెద్దల మాట.
బ్రతుకును ఇచ్చేది కన్నతల్లి.
సుందర రూపం అని భావించేది కన్నతల్లి.
తొలిపలుకు పలికించేది,
తొలి అడుగు నడిపించేది
కరుణ నిండుగ నింపేది
కమ్మని మాటల మూటలు
చెప్పేది.
అంతరంగాల అక్షరాలు
నీతిని క్యాతిని తెలిపేది
కన్నతల్లి.
తరగని ఆస్తులైన
వదలని భారమైన
సమతూకంలో తూచేది
కన్నతల్లి.
కాలం మారినా కారణం ఏదైనా
నీ కోసమై దిగివచ్చిన దేవత
కన్నతల్లి.
– జి.జయ

Related Posts