తల్లిదండ్రులు

తల్లిదండ్రులు

మన ముందున్న ప్రత్యక్ష దైవాలు..
మన తలరాతను మార్చే నిజమైన బ్రహ్మలు..
సమస్త మానవాళి ఏర్పాటుకు వీరే మూలాలు..
ప్రేమానురాగాలకు ప్రత్యక్ష స్వరూపాలు..
స్వచ్ఛమైన త్యాగాలకు ప్రతిరూపాలు..
కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగు నిస్తున్న ఆత్మీయ దీపాలు..
ఏ ప్రతిఫలం ఆశించని ఆదర్శ జీవితాలు..
మరణమని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చే దేవతలు..
భారమని తెలిసినా బాధ్యతకు జీవితాన్ని పణం పెట్టిన దేవుళ్ళు..
కన్న బిడ్డల ప్రేమకై పరితపించు పసి హృదయాలు..
నిత్యం బిడ్డల క్షేమం తలంచు శ్రేయోభిలాషులు..

తల్లిదండ్రుల గొప్పతనం చెప్పడానికి…
చూపించడానికి…
అక్షరాలు సరిపోవు…
మాటలు మిగలవు…
రాతలు చెరగవు…
భాష చాలదు…

అట్టి మహనీయులకు మనం ఏమి ఇవ్వగలం…
తిరిగి మనమే వారికి తల్లిదండ్రులమై కాపాడుకోవడమే..

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts