తల్లిగాణ(న)ము (తెలంగాణము)!!

తల్లిగాణ(న)ము (తెలంగాణము)!!

నా బిడ్డ లాల,
మీరిద్దరేకం,
నా కండ్లు
అయ్యలాల ……!

నజరు బగ్గగ నుండె.
పెయ్యి యాష్ట కొచ్చె.
ఈ కట్టె పెయ్యల చేరు.
పైలం గుండుర్రి
ఓ, నా కొల్లాగ లాల ……..!

అంద కుర్రి నాకు
ఆడనే నిమ్మలం మీకు.
అణుకు చేతులకు
అందిన మిమ్ముల
నే చేజార్చ జిక్క
బిడ్డలాల.

నెత్తి నెత్తి సూత్త, కండ్లు
నిక్కబొడిసి సూత్త.
గంగి గోవు లస్మంటి ది మీరు
నజరు బగ్గగ నుండె.
మీరిద్దరేకం,
నా కండ్లు
అయ్యలాల……….!

– వాసు

Related Posts