తనకు మాలిన ధర్మం
నీ త్యాగానికి కూడా ఓ హద్దు ఉండాలి రాధిక అన్నాడు…శోభన్..
ఎందుకండీ? ఇందులో త్యాగం కన్నా నా స్వార్థమే ఎక్కువంది అంది రాధిక..ఆమెను తెచ్చుకో! ఉంచుకో! పెంచు పోషించు ! కానీ నన్ను పెళ్లి చేసుకోమనడ మెందుకు? పైగా అది నీ స్వార్థమనడమేంటి?
అవును మరి అది నా స్వార్థమే! నాకెలాగు పిల్లలుపుట్టరని తెల్సింది కదా! మీరామెను పెళ్లి చేసుకుంటెపిల్లలు పుడతారు ఆ విధం గా నైనా మీ బిడ్డకు తల్లినైతాను కదా!
అది స్వార్థం కాదా?అమాయకమైన రాధికను ఏమనుకోవాలో అర్థం కాలేదు శోభన్ కి..
పెళ్లయ్యాక ఇలా నీతో ఉండనిస్తుందా? ఇలా ఇద్దరందగ్గరగా ఉండగలమా? అన్నాడు శోభన్..శాంతి చాలా మంచిదండి మీరను కుంటున్నట్టు అలాంటిది కాదండి..
ఒక వేళ అయినా కూడా అప్పుడు పిల్లలు ఉంటారు కదా నాతో ఉండడానికి..
మీరు కొంచం దూరమైనా అంది గోముగా!అది నువ్వనుకున్నంత ఈజీ కాదు అన్నాడు..అయినా వినడం లేదు రాధిక తన ప్రాణ స్నేహితురాలు
తల్లీ తండ్రీ లేని ఒంటరిదయింది..
ఒకసారి షాపులో కలిసి బాధ పడింది తనకూ పిల్లలుకరని డాక్టర్లు చెప్పేసారు..అందుకే శ్రీవారికి నచ్చ చెప్పింది..
చివరకు రాధికకు పిల్లల మీద ఉన్న ప్రేమ కోసం ఒప్పుకోక తప్పలేదు శోభన్ కి..
రాధిక దగ్గరుండి జరిపించింది పెళ్లి..
పెళ్లయ్యాక గానీ అర్థం కాలేదు రాధికకు ఏం కోల్పోయానో అని..అయినా తనే చేసిన పని కనుక సర్థుకు పోయిందిఇక పిల్లలు కూడా అయ్యారు కవల పిల్లలు..
శాంతి కన్నా ఎక్కువ రాధికనే సంతోషించింది కానీశాంతి పిల్లలను రాధికకు అస్సలు ఇవ్వనీయడం లేదు.
ఆయాను పెట్టుకుంది శోభన్ లేనప్పుడు ఒకలా!ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించేది..ఆయాతో గొడ్రాలు నీడ నా పిల్లలపై పడకూడదు అంది
ఆ మాట రాధిక విన్నది గుండె తరుక్కు పోయింది..అయినా శోభన్ కు తెలువ కుండా ఉంది..
కానీ శోభన్ కు వేరే ఊరికి బదిలీ అయింది..అక్కడికి రాధికను రావద్దని షరతు పెట్టింది శాంతి..శోభన్ రాధిక దగ్గర ఏడ్చాడు ..
ఎందుకు చేసావు ఈ పెళ్లి?నీ త్యాగానికేమైనా అర్థం ఉందా??ఏం త్యాగ నిరతి ఇది? నేనప్పుడే చెప్పాను కదా! ఇలా
అవుతుందని అన్నాడు..
ఏమైనా భరిస్తాను మీరు మాత్రం శాంతి తో, పిల్లలతో, సుఖంగా ఉండండి అంది నవ్వుతూ! లోపల దావానలాన్ని మింగుతూ! శోభన్, శాంతి, పిల్లలు వెళ్లి పోయాక తనలో దాగున్న ఏడుపునంతా పైకి కక్కుతూ ఒంటరిగా మిగిలి పోయింది రాధిక…
అందుకే తనకు మాలిన ధర్మం చేయరాదు..
-ఉమాదేవి ఎర్రం