తను నేను ఓ వనిత

తను నేను ఓ వనిత

ఓ రోజు మధ్యాహ్నం వేళ అమ్మ నా దగ్గరికి వచ్చి, “మూడు సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియా నుండి బావ వచ్చాడు వచ్చి కూడా నెల గడుస్తుంది. వెళ్లి పలకరించకపోతే అత్త ఏమనుకుంటుంది” అనడంతో ఆ రోజు సాయంత్రం అత్త వాళ్ళ ఇంటికి వెళ్లా.
గేట్ లోపలికి వెళ్ళగానే వాచ్మెన్ వచ్చి “ఎవరు లేరమ్మ బయటికి వెళ్లారు”, అనగానే చిరాకుతో మళ్ళీ ఇంకోరోజు రావాలా అని మనసులో అనుకుంటూ వెనుతిరిగిన మరుక్షణం “అమ్మా !సార్ మేడం బయటికి వెళ్లారు, వాళ్ళ బాబు ఉన్నారు” అని వినిపిస్తున్న వాచ్మెన్ మాటలతో హమ్మయ్య!
హాయ్ చెప్పి వెళ్లిపోదాం ఒక పని అయిపోతుంది అనుకుంటూ లోపలికి వెళ్ళగానే హాల్ లో చింపి పడేసిన రెండు పేపర్లు కనిపించాయి. పట్టించుకోకుండా ఇల్లు అంతా చూసా, ఎవరు లేరు.
బావ రెండవ ఫ్లోర్లోని తన రూమ్ బాత్రూములో ఉన్నట్టు గమనించా. హాల్ లోని సోఫాలో కూర్చుందాం అని వెళ్లి కూర్చున్న నాకు, ఆ పక్కనే అప్పుడే రాసినట్టుగా ఉన్న ఒక పేపర్ తారసపడింది.
మనకెందుకులే అనుకొని అలాగే కూర్చున్న కాసేపటికి మనసు ఉండలేక ఆ పేపర్ వైపు చూస్తే, మొదటి లైన్…..
‘క్షమించండి నాన్న’. ఒక్కసారిగా ఎమీ అర్థం కాలేదు. ఏది ఐతే అది ఐయ్యింది అని పేపర్ చదవడం మొదలు పెట్టిన నాకు బావ ఇండియాకి వచ్చింది వాళ్ళ అమ్మానాన్నలని చూసి చనిపోవడానికి అని తెలిసి ఒక్కసారిగా ఊపిరి ఆగినట్టు అనిపించింది.పే
పర్ యథావిధిగా పెట్టి గుట్టు చప్పుడు అవ్వకుండా బయటికి వచ్చేసా…. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు ఏం చేయాలో తోచటం లేదు. ఒక పది నిమిషాలు అలా ఆగి బావకి ప్రాణమిత్రుడు ఐనటువంటి భార్గవ్ అన్నయ్యకి కాల్ చేసాను.
ఇక్కడ జరిగింది ఏం చెప్పకుండా బావ డల్ గా ఉంటున్నారు ఏమైంది అని బలవంతం చేయడంతో, “రామ్ కు తన బీటెక్ ఫ్రెండ్ ఐనటువంటి అమూల్య అనే అమ్మాయి ఆస్ట్రేలియాలో కలిసింది వాళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు” అని చెప్పి ఆగిపోయారు.
అప్పటికే అయోమయంలో ఉన్న నేను తరువాత ఏమైంది అని అడిగా “ఆ అమ్మాయి ఆక్సిడెంట్ ఐయ్యి చనిపోయింది దాని నుండి బయటికి రాలేకపోతున్నాడు వాడు ఇక్కడికి వస్తే ఐన కాస్త బయట పడతాడని నేనే బలవంతం చేసా రమ్మని” అనే అతని మాటలు విని మళ్ళీ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసా…
అప్పటికి అంతా స్పష్టంగా అర్థం ఐయ్యింది. ఏం చేయాలో తెలియట్లేదు ఇంటికి వెళ్లిపోదాం అంటే అడుగులు ముందుకు పడటంలేదు. మళ్ళీ లోపలికి వచ్చా, నన్ను గమనించిన బావ ఆ పేపర్ లు దాచిపెట్టడం చూసా ఏమి తెలియనట్టు మాట్లాడటం మొదలు పెట్టా….
ఎంత మాట్లాడించిన తనలో స్పందన లేదు ఏదో మాట్లాడుతున్నాడు అంతే… ఆ ఎరుపెక్కిన కళ్ళు వాటిలోని బాధని చూస్తూ ఉండలేకపోయా, వెళ్తున్నా అని చెప్పి గడప దాటుతుండగా అత్త కడుపు కోత కళ్ళ ముందు కనిపిస్తుంది ఆగిపోయా…
ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలీదు. బావ దగ్గరికి వెళ్ళా కళ్ళల్లో నీళ్ళు సంద్రంలోని అలల వలె  పొంగుకొచ్చాయి. నేనెందుకు ఏడుస్తున్నానో అర్థం అవ్వని బావ “ఏమైంది చిన్ని!”, అని ఆశ్చర్యంతో అడగటం మొదలు పెట్టాడు.
ఏం చెప్పాలో ఆలోచిస్తూ…. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మీ స్థానంలో ఇంకొకరు అంటే నేను ప్రాణాలతో ఉండను అని చెప్పిన నా మాటలు విన్న బావ అలా నేలపై పడిపోయాడు. ఏడుస్తూ చెప్పేసరికి నిజం అనుకున్నాడు.
కాసేపటికి తను నన్ను ఓదార్చటం మొదలు పెట్టాడు జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తుంటే అంతా తెలిసిన నేను లేని నా ప్రేమ గురించి చెప్పటం మొదలు పెట్టా…
తనకి ఆలోచించుకునే సమయం ఇవ్వలేదు “నేను రేపు వచ్చి మాట్లాడ్తా నువ్వు వెళ్ళు అని చెప్పాడు”. అయినా వెళ్ళలేదు. రాత్రి పదిన్నర అవుతుంది. అత్త వాళ్ళు వచ్చారు కాసేపు ఉన్న.
నైట్ షిఫ్ట్ అత్త వెళ్తాను అన్నాను “చీకట్లో ఒక్కదానివా!?” అని అత్త బావని పంపిచింది. ఇంటికి వచ్చాము. అమ్మ బావని ఉండమంది, బావ ఉండిపోయాడు. అంతా అయోమయంగా ఉంది బావకి.
తెల్లారింది, బావ దగ్గరికి వెళ్లి మాట్లాడ్తావా బావ అన్నాను. ఏం చేయాలో తెలియక అయోమయంలోనే నాన్నతో మాట్లాడాడు. నాన్న వాళ్ళు చిన్నప్పటి నుండి అనుకుంటున్న విషయమే కాబట్టి హడావిడిగా 15 రోజుల్లో పెళ్లి అయిపోయింది.
బావని ఐతే కాపాడుకున్నాను అనే తృప్తితో నా గుండెల్లో నిజాన్ని దాచుకొని నేను… తన మనసులోని ప్రేమని దాచుకొని తను..
నేను అంతా తెలిసిన ఏమి తెలియనట్టుగానే ఉంటున్నా… నేను ఇష్టంగా బావని చేసుకున్న అనే అపోహతో బావ కాస్త కుదుట పడ్డాడు. సంతోషంగా గడుపుతున్నాం.
అప్పుడప్పుడు అమూల్య అని పిలిచే పిలుపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. ఎక్కడ నేను విన్నానో అని తన ఆవేదన, అలా పిలిచిన ప్రతిసారి విననట్టుగా నేను….
ఇప్పుడు మాకు రెండేళ్ల పాప పేరు అమూల్య. అప్పుడు నన్ను అమూల్య అని పిలిచి హమ్మయ్య వినలేదా అనుకునేవాడు కాస్త ఇప్పుడు నిన్ను కాదు పాపని అని చెప్పి కప్పిపుచ్చుకుంటున్న ఆయన అమాయకత్వం చూసి చిరునవ్వుతో సాగిపోతున్నా….
– రేణు
Previous post పంచాంగం 05.03.2022
Next post జగమే మాయ!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *