తను

తను

 

సూర్యుడు
ఆలస్యంగా ఉదయిస్తున్నాడు
తనుందని!

బియ్యం
ఉడకకుండా అన్నమౌతోంది
తనుందని!

ఇల్లు
కాళ్లులేకున్నా పరిగెడుతోంది
తనుందని!

చెట్లు
కొమ్మలు ముడుచుకున్నాయి
తనుందని!

నీడ
గురకపెట్టి నిద్రిస్తోంది
తనుందని!

చంద్రుడు
వేగంగా అస్తమిస్తున్నాడు
తనుందనే..!!

తను.. అమ్మ!

-గురువర్ధన్ రెడ్డి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress