తనువు

తనువు

తనువు తనువు ఏకమై
పూల పోదరింటిలో కాపురముంటూ
నీ ప్రేమలో మమేకమై పోతూ
మనింటికి యజమానినవుతూ
ఇద్దరం ఒక్కటిగా మారుతూ
ఒకరినొకరం అర్దం చేసుకుంటూ
ప్రేమ లో మునిగితేలుతూ
బాధ్యతలను పంచుకుంటూ
ఓదార్పునై నీ ఇంటి ఇల్లాలునై
నీ కంటి పాపగా మారి
వంశాన్ని వృద్ది చేసిన క్షణానా
నా తనువు మనసు పులకరించి పోతూ
ఆనందాన్ని పంచుకొంటూ
కొత్త బాసలు చేసుకుంటూ
జీవన పయనం సాగిద్దాం….

– భవ్య చారు

Related Posts