తనువు

తనువు

తనువుకు చాలని తన్మయత్వం
గుప్పెడంత గుండెకు ఆకారం

స్పందనలన్నీ తనువే చేయాలి
పులకించినా జలదరించినా

మనసు భాషల ఊసులు
తనువు తరచి చెబుతుంది

శ్వాస ధ్యాసల రూపమే
విడదీయని బంధమే తనువు

పెనవేసిన తనువు మనువుల
సమ్మిలతమే ప్రతిసృష్టికి మూలమే కదా ఈ జగతి ….?

– జి జయ

Related Posts