తపన

తపన

మనిషి జీవితం
మాయా ద్వీపం కాదు
దేవుడు ప్రత్యక్షమై కోరుకున్నది ఇవ్వడానికి
తపన లేనిదే ఏది
సాధ్యం కాదు
తపనను తూచి మరీ
ఫలితం కనిపిస్తుంది

మట్టిలో మాణిక్యం అని
వూరికే అంటారా మరి
ఆ ప్రయత్నం వెనుక తపన

తల్లి తండ్రులు మార్గం
చూపాలని తపన

ఆపన్నహస్తం అందించాలని మానవతావాది తపన

ఆటల్లో రాణించాలని
ఆటగాళ్ళ వొరవడి తపన
గాయకులు మాధుర్యాన్ని
పండించాలని తపన

అందాల మేడలు కట్టాలని
ఇంజనీర్ల తపన

సందేశాన్ని ఇవ్వడానికి
శాసన కర్తల తపన

కదిలేప్రపంచాన్ని
చూపడానికి కళాకారుల
తపన

పోయే ప్రాణం నిలపడానికి
వైద్యుల తపన

ఊహకందని విషయాల
కోసం శాస్త్ర వేత్తల తపన

చావు పుట్టుకల మర్మమేమిటి అని
సన్యాసి తపన

భగవంతుని లీలలు ఏమిటో
అని భక్తుడి తపన

ఈ తరం ఇలా జీవిస్తుంది
అంటే జ్ఞాన కోవిదులు
వెలుగు పూవులు పూయించడమే

నిత్య ప్రయత్నంతో
నిరంతర సాధనతో
తపన ఆవిష్కృతం కావాలి.

– జి జయ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *