తపించు

తపించు

నీలోని ఆశయాలకై
నీలోని లక్ష్యాలకై

నీ గమ్యాన్ని చేరడానికి
నీ జీవితగమనానికై

నీ పురోభివృద్ధికై
నీ ఆశలనిచ్చెనకై

నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి

నువ్వు మంచి మార్గంలో నడవడానికై
నీ తల్లిదండ్రుల ఆశయసాధనకై

నిన్ను నమ్మినవారికోసమై
నువ్వు నమ్మినవారికోసమై

నలుగురి మంచికోసమై
నీ తోటివారి అభివృద్ధికై

తపించు తపించు
నీ ఆశయసాధనకై

– గోగుల నారాయణ 

Related Posts