తప్పదు

తప్పదు

కురిసే వర్షం పుడమికి పాటై ప్రవహిస్తోంది కానీ
మనస్సుకి లాలిపాట పాడే
వర్షచ్ఛాయ జాడేలేదు!

ఆకలికేకల ప్రకంపనలెందుకో
అందరినీ తాకటంలేదో
లేక ఏ మధుపాన సేవలోనో
మరే మధుపం వేటలో మునిగున్నారో
మనుషులు

ఇందుమూలంగా తెలియచేసేదేమనగా
మనసులు అమ్మేసుకున్నవారూ
తాకట్టు పెట్టినవారూ
మనసుకు లాలిపాట కోరుకునే హక్కును కోల్పోయారని

పుడమికి చినుకు
మావిచిగురు వంటిది
మనిషికి కలగనటం లాంటిది
ఇప్పుడు స్వప్నాలన్నీ వలసబాట వలసబాటనెంచుకున్నాయి
మనిషి స్వీయాన్వేషణలో సాగక తప్పదు

– సి. యస్. రాంబాబు

Related Posts