టీ

టీ

మన రోజువారీ జీవితంలో “టీ” యొక్క ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
దినచర్యలో భాగంగా టీ తాగడం అలవాటుగా మారిపోయింది.

పేదవాడి నుండి గొప్పవారి వరకు టీతో
అద్భుతమైన హాయిని పొందుతారు

ఎన్నో రకాల పనులు పని ఒత్తిడులు వున్నా వాటినుండి చిటికెలో
ఉపశమనం పొందుతాము
ఇంకా అలసటగా వున్నా టీ సేవించి నపుడు తాజా గా
శక్తిని పొంది ఉత్సాహంగా
ను ఉల్లాసంగా ను మనసు తేలిక పడుతుంది.
ఇంకొక గొప్పవిషయంఏమిటి
అంటే స్నేహ సంబంధాలను
మెరుగు పరుస్తాయి. టీ
తాగే టైంలో ఎదుటివారితో
వారి భావాలను పంచుకుంటారు కాబట్టి
సంభాషణకు కూడా ముందు గౌరవ ప్రదంగా టీ ఇస్తుంటారు.
ఎదుటి వారితో రోజు వారి
పలకరింపు లకు టీ తాగారు
కదాఅనిమొదలుపెడతాము . పరిచయాల వేదికలు
పామరుడి నుండి పండితులవరకు
కార్మికుల నుండి కార్యాలయాల వరకు
ఇంటికి వచ్చిన అతిథుల నుండి ప్రభుత్వాల వరకు
మర్యాదల ఇచ్చిపుచ్చుకునే
పరంపర ” టీ ” సొంతం.
కుటుంబంలో అమ్మ చేతి
టీ , భార్య చేతి టీ తోనే
తృప్తి వుంటుంది. వినోదాల నుండి విందుల వరకు టీ ప్రత్యేకం.

కాకా హోటల్ నుండి స్టార్ హోటల్ లోనూ
వేడి వేడి టీ సేవించిన
అనుభూతి హాయి మాటల్లో
చెప్పరాదు. ఇరానీ టీ భాగ్య నగర పేరు ప్రఖ్యాతులు విశ్వ వ్యాప్తం.
ప్రతి ఊరికి ప్రతి వీధి కి ప్రతి ఆఫీస్ కి దగ్గర్లో టీ షాప్స్
అందరికి అందుబాటు ధరల్లో వుంటూ మార్గాల్లో
కాసేపు సేద తీరి మళ్ళీ పనుల్లో బిజీ అవుతారు
కొన్ని సందర్భాల్లో టీ టైమ్
వీక్షణకోసంఇంటినమూనా
మార్పు చేసుకుంటారు.
టీ చరిత్ర చైనా నుండి మొదలు అయ్యి ప్రతి ఒక్కరి
జీవితంలో భాగంగా కలిసిపోయింది. ” టీ “
అలాగ …….?

– జి జయ

Related Posts