"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

తేడా

తేడా

అనూష, శాంతి ఇద్దరు మంచి మిత్రులు. వాళ్ళు ఎలా మిత్రులు అయ్యారు అంటే ఇంకొక మిత్రురాలు ద్వారా స్నేహితులు అయ్యారు.

ఇద్దరికీ బాగా స్నేహం కుదిరింది.ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒక్కటే, శాంతి ఆలోచనలు అనూష కు వాళ్ళ అన్నయ్యను గుర్తు చేశాయి.

అతను కూడా అలాగే అనూష అంటే ప్రేమ చూపేవాడు అని ,కానీ కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాడు అని చెప్పి బాధ పడింది.

శాంతి తనని ఓదార్చింది. రోజు మాట్లాడుకునే వాళ్ళు కేవలం ఫోన్ లోనే మేసెజ్ చేసుకునే వారు. ఇద్దరూ రచయితలే కాబట్టి, తమ రచనల గురించి మాట్లాడుకుంటూ ఇంకా బాగా ఎలా రాయాలి? అనుకుంటూ చాట్ చేస్తుండే వాళ్ళు.

ఇక అనూష కు అప్పుడే కొత్తగా పెళ్లయ్యింది. కాబట్టి ఫోన్ ఎక్కువగా వాడేది కాదు. ఎప్పుడో ఒకసారి రిప్లై ఇచ్చేది.

శాంతి మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకుని తనని ఎక్కువగా మాట్లాడమని అనేవారు కాదు. ఆమె చేస్తేనే రిప్లై ఇచ్చేవారు.

అంతలోనే అనూష పుట్టిన రోజు వచ్చింది.అంతకు ముందు తన ఫోటోలు పంపడం తో, శాంతి ఒక మంచి పుట్టినరోజు వీడియో చేసి పంపింది. ఆ రోజంతా అనూష ఊహించని రీతిలో శుభాకాంక్షలు తెలిపింది.

దాంతో బాగా సంతోషించింది అనూష. ఇంతవరకు తనకు ఇలా ఎవరు విష్ చేయలేదు. అని అందరికీ చెప్పుకుని సంతోషించింది. వారి బంధం ఇంకా బలంగా మారింది.

కొన్ని రోజులు గడిచాక శాంతి కి ఒక ఆలోచన వచ్చింది. కవిత్రయం లాగా తాము ముగ్గురు కూడా కలిసి ఒక సీరియల్ రాస్తే ఎలా ఉంటుంది ? అనేది ఆ ఆలోచన ,ఆ ఆలోచనను అనూష తోనూ, మరొక మిత్రురాలు తో పంచుకుంది.

అనూష సరే అంది. కానీ ఇంకొక మిత్రురాలు తనకు తన పిల్లలతో కుదరదు. అని చెప్పడం తో. శాంతి అనూష లు కలిసి రాయాలి అనుకున్నారు. అప్పటికే శాంతి సగం కథ ను రాసింది.తర్వాత ఆలోచన రాకపోవడం తో అనూష తో పంచుకుంది.

అనూష సరే అనడం తో తాను అప్పటిదాకా రాసిన కథను తనకు పంపి తర్వాత ఎలా రాస్తే బాగుంటుందో అలా రాయమని అంది శాంతి.

సరే కాస్త సమయం పడుతుంది అని చెప్పింది అనూష. సరేనంది శాంతి. అలా కొన్ని రోజులు గడిచాక అనూష తాను రాసిన కథ ను పంపింది శాంతి కి.

శాంతి అనూష పంపిన కథ చదివి అసలు తాను అనుకున్న ఆలోచనకు ,అనూష రాసిన కథ కు పొంతన లేదు అని గ్రహించింది. శాంతి కి మోహమటాలు లేవు. కాబట్టి అదే విషయాన్ని అనూషతో పంచుకుంది.

ఏంటి అనూష అసలు నువ్వు రాసింది వేరు, నేను నీకు చెప్పింది అర్థం కాలేదా ,?  మళ్లీ అడగాల్సింది, నువ్వు రాసింది అసలు బాగా లేదు. మళ్లీ రాయి అని అంది. అప్పటికి సరే అన్న అనూష, కొన్ని రోజులు అసలు మాట్లాడలేదు. అసలు ఆన్లైన్ కి కూడా రాలేదు.

ఏమైంది అని అడిగితే మేము ఇల్లు కట్టుకుంటున్నారు అని ఆ హడావుడి లో ఉన్నాను అని చెప్పింది. సరే అనుకుంది శాంతి, తర్వాత తర్వాత ఫోన్ పాడయ్యింది, నేను మా వారికి ఇస్తున్నాను . నాకు మెసేజ్ లు చేయకండి అని అండి.

సరే ఫోన్ అన్నప్పుడు మామూలే కదా అనుకున్నారు శాంతి వాళ్ళు. కానీ అనూష మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు.

కానీ ఇంకో మిత్రురాలి తో మాట్లాడుతూ, రచనలు చేస్తూ ఉందట, కానీ శాంతి తో మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. శాంతి కి ఇంకో మిత్రురాలు అయినా అఖిల ద్వారా అనూష క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండేది.

అనూష గర్భవతి అని తెలిసి చాలా సంతోషించింది శాంతి. తర్వాత బాబు నో, పాప నో పుట్టారు. అని తెలిసి చాలా సంతోషించింది శాంతి.

అసలు శాంతి చేసిన తప్పేంటి ? తాను అనుకున్నట్టు ఆలోచనలు పంచుకున్నది. అనూష రాయలేక పోయింది. అని చెప్పడమే శాంతి చేసిన తప్పా,? ఒప్పా, ? మనిషి ఒక్క మాట తో అన్ని రోజుల స్నేహాన్ని ఎలా వదిలేస్తుంది ? తాను వాదిం చాలి లేదా చెప్పి ఒప్పించగలగాలి.

అలా కాదు ఇలా అని చెప్పగలగాలి, చెప్పి ఒప్పించగలిగితే శాంతి ఒప్పుకునేది ఏమో , లేదా నీకు నచ్చక పోతే వదిలేయ్ నేను రాయను అంటే అయిపోయేది కదా.

మాట మాత్రం చెప్పకుండా హటాత్తుగా గా మాట్లాడడం ఆపేయడం, ఇంకో మిత్రురాలి తో శాంతి తో మాట్లాడను అనడం ఎంత వరకు సమంజసం ? సమాధానం మీకైన తెలిస్తే చెప్పండి…

మనిషి ప్రవర్తనకు మార్పులు అనేకం ఉంటాయి. అందులో చిన్న ,చిన్నవి ఎన్నో ఉంటాయి.తన ముందు నవ్వాడు అని,

లేదా తుమ్మాడు ఆనో , తనను తన ఇంటికి పిలవలేదు అనో ఇలా చిన్న చిన్న కారణాలు అనేకం. చాలా వరకు స్నేహితుల్లో జరుగుతాయి.

ఇంకా కుటుంబాలు శుభకార్యాలు చేసుకున్నప్పుడు మొదటి బంతి భోజనం పెట్టలేదు అని , మొదటి సారి బట్టలు పెట్టలేదని, తిండి విషయం లో ముక్కలు వేయలేదు, అంత పులుసు వేశారని, చివరికి ములుగు బొక్క రాలేదని, కూడా యేళ్ళ కు యేళ్లు మాట్లాడని వారు అనేకం ఉన్నారు.

ఉంటాయి. మీకు కూడా ఇవ్వన్నీ తెలిసే ఉంటాయి కదా, ఇంతకీ అనూష ఎప్పటికైనా శాంతి తో మాట్లాడుతుందా లేదా అనేది మీరే చెప్పండి?

 

 

-భవ్యచారు

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *