తేడా

తేడా

సృష్టికి జీవం పోసినది రెండక్షరాల పదం అమ్మ
అంటూ పెద్ద పదాలు కాకుండా అమ్మ అని పిలిస్తే
ఎంత రాత్రి అయినా ఏమైంది బిడ్డా అంటూ లేచి వచ్చేది తల్లి మాత్రమే.

ప్రతి అమ్మాయి పెళ్ళి అయ్యాక తల్లిగా మారిన క్షణం నుండి బాధ్యతను పెంచుకుంటూ,

బిడ్డను కాపాడుతూ చెడు దార్లో వెళ్లకుండా మంచి మార్గాన్ని సూచిస్తుంది.

కానీ తల్లి బిడ్డను కనగలదు కానీ వారి రతాను కనలేదు.

బిడ్డ కు అన్ని మంచి మాటలే చెప్తుంది.

కానీ పుట్టిన ప్రతి బిడ్డ. మంచి దార్లో వెళ్ళాలని లేదు.

స్నేహాల వళ్ళో, వేరే విషయాల వల్ల లెడ్ a చెడు అలవాట్లు వల్లనో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి రాత ను రాసుకోవడం  జరుగుతుంది అని అనుకుని వుంటే  దానికి ఆ  తల్లెం చేయదు .

కానీ ఎవడో ఒకడు తప్పు చేయగానే తల్లి పెంపకం బాగా లేదంటూ నిందలు వేస్తారు.

క కూతురు అత్తారింట్లో ఏ పని సరిగ్గా చేయక పోయినా నీ తల్లి నీకు నేర్పలేదా అంటూ వేధిస్తారు.

ప్రతి తల్లి తన బిడ్డ గొప్పోడు  అవ్వాలనే కలలు కంటుంది. గొప్పగా చెప్పుకుంటుంది.

చిన్న బహుమతి వచ్చినా అందరికీ చూపించి ఆనంద పడుతుంది.

ఏ తల్లి బిడ్డ చెడు కొరదు. తనను పట్టించుకొకపోయినా కూడా బిడ్డను బాగుండమనే దివిస్తుంది.

కొందరు  చేసిన పిచ్చి పనులకు తల్లిని నిందించడం సరికాదని చెప్పడమే నా అభిప్రాయం.

ప్రతి తల్లికి ఈ అక్షర లక్షల మాలాలు సమర్పిస్తూ శత సహస్ర వందనాలతో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ..

– అర్చన

 

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress