తీపి జ్ఞాపకాలు

తీపి జ్ఞాపకాలు

గతమును నెమరు వేయ
వచ్చు జ్ఞాపకాలు ఎన్నో
అందులోన కొన్ని
చాల తీయగ నుండు

జిహ్వకు తగులు తీపి
మధురముగ నుండు
మనసుకు తగిలిన, అతి
మధురముగ నుండు

తీపి స్మృతులు
రకముల నుండు నెన్నో
బాల్యమందువి కొన్ని
యవ్వనము నందువి కొన్ని

తీపి జ్ఞాపకాలు అమిత
ఆనందము నిచ్చు
బాల్య స్నేహితులు ఒకరికొకరు
కలిసినపుడు ఎంతో

కాలము తెలియక మైమరచి
పంచుకొందురు అనుభూతుల
పెల్లుబికిన ఆనందముతొ
ఒకరికొకరు ఉత్సాహంతొ

– రమణ బొమ్మకంటి

Related Posts