తీపిరుచి

తీపిరుచి

తరగని మోహంలా సంధ్యారాగం
ఆశల్ని ఆలపిస్తుంటుంది
చీకటిలో మెరిసే వెలుగురేఖోదే
దీవెనల దారిని తలపిస్తుంటుంది

తబ్బిబ్బైన క్షణాలను జేబులో వేసుకుంటావు
ఊసులను మూటగట్టే వేణుగానమేదో మలిన మనసును
మార్చేస్తుంటుంది

గజిబిజి గందరగోళాల మేళం
రసకందాయంలో నీరసాల తాళంతో
జీవితం ఉస్సురంటున్నవేళ
ముఖచిత్రమై వెలిగే రాతిరి
మానసానికో తీపిరుచుల పందిరి

– సి.యస్.రాంబాబు

Related Posts