తెగిన గాలిపటం

తెగిన గాలిపటం

తెగిన గాలిపటం

అమృత హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకునే అమ్మాయి. తోటి మిత్రులతో ఆడుకుంటూ, చదువుకుంటూ హాయిగా గడుపుతూ ఉండేది. అయితే ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగి పోతారు. అలాగే అమృత కూడా ఎదిగి పోయింది. అయితే అమృత తల్లిదండ్రులు ఇంకో విధంగా ఆలోచించారు. అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి పంపిస్తే తనకు ముసలి తనం వచ్చే లోపు పిల్లలు ఎదిగి వస్తారు అనే ఆలోచనలతో సంభంధాలు చూడడం మొదలు పెట్టారు.

ఇవేవి తెలియని అమృత తన పై తరగతి కి సంభందించిన పుస్తకాలు తెచ్చుకుని చదవడం మొదలు పెట్టింది. ఒకరోజు అమ్మ అమృతను పిలిచి అమ్మా అమృత మన ఇంటికి నిన్ను చూడడానికి వస్తున్నారు. కాబట్టి నువ్వు బాగా తయారవ్వమని అంటూ తానే తన చీరల్లో ఒకటి కట్టింది అమృత కి.

తననీ చూడడానికి వస్తే నేనెందుకు తయారవ్వాలి అమ్మ అంది అమాయకంగా అమృత. అమ్మ నువ్వు అబ్బాయికి నచ్చితే నీకు అతనికి పెళ్లి జరుగుతుంది నీకు పెళ్లి చేయబోతున్నా అంది తల్లి. పెళ్లా అంటే ఏమిటమ్మ అనగానే తల్లి, ఏముందమ్మా ఇక్కడ నేను చేస్తున్న పనులన్నీ నువ్వు అక్కడ చేయాలి అంటూ తనకి తెలిసింది ఏదో చెప్తూ తయారు చేసింది.

పెళ్ళివారు రావడం, అమృత వారికి నచ్చడం, పెళ్లి కి ముహూర్తాలు పెట్టడం అన్ని ఒకే రోజులో జరిగి పోయాయి. వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పడం వల్ల అమృత తల్లిదండ్రులు అందరి వద్దా అప్పులు చేసి, అమ్మాయి పెళ్ళి జరిపించారు. అయితే పెళ్లి అయ్యాక అప్పగింతలు అప్పుడు అమృత చాలా ఏడ్చింది.

చాలు చాలు ఇక పద అంటూ భర్త మోచేత్తో పొడవడం తో కళ్ళు తుడుచుకుని బయలుదేరింది. అత్తారింట్లో కొన్ని రోజులు బాగానే చూసుకున్నారు అయితే అమృత అత్తగారు పదేపదే తన మాటలతో అమృతను హింసించేవారు కానీ భర్త, మామ ఇద్దరూ అమృత ను ఎంతో బాగా చూసుకునేవారు. భర్త తనని ప్రేమగా చూసుకోవడం వల్ల అమృత అత్త ఎన్ని మాటలు అన్నా ఓర్చుకుంటూ ఉండేది అలా అమృతకి సంవత్సరం తిరిగేసరికి ఒక పాప పుట్టింది.

అమృత భర్త మేస్త్రి తనకి ఒక ట్రాక్టర్ కూడా ఉంది. అది నడుపుతూ జీవితం కొనసాగించేవాడు పొద్దున్నే లేచి ట్రాక్టర్ తీసుకొని పనికి వెళ్లేవాడు. అలా ఒక రోజు పని కోసం అంటూ వెళ్లిన అమృత భర్త తిరిగి వచ్చే సమయంలో ఒక లారీ వచ్చి ట్రాక్టర్ ని ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలిసి అమృత చాలా ఏడ్చింది.

అయితే అత్త మాత్రం నీవల్లనే నా కొడుకు చనిపోయాడు అంటూ పాప పుట్టడం వల్లనే పాప పుట్టిన వేళా విశేషం మంచిది కాదు అని ఆమె పుట్టడం వల్లనే నా కొడుకు చనిపోయాడు అంటూ నిందలు వేసి అమృతను ఇంట్లో నుంచి తరిమి వేసింది. దాంతో ఏం చేయాలో తెలియని అమృత తిరిగి తన పుట్టింటికి చేరింది.

పుట్టేడు దుఃఖంతో ఇంటికి చేరిన ఆమెని తల్లిదండ్రులు అక్కున చేర్చుకున్నారు ధైర్యం చెప్పారు ఏంతో అండగా నిలిచారు. కానీ అమృత పై దయలేని కాలం పొలానికి నీళ్లు పెట్టి రావడానికి వెళ్లిన తల్లిదండ్రులను కరెంటు తీగల రూపంలో ఇద్దరినీ ఒకేసారి బలి తీసుకుంది.

దాంతో అమృత, తన పాప ఇద్దరు ఒంటరి అయ్యారు. అమృత జీవితం తెగిన గాలిపటంలా మారింది తనకేం చేయాలో అర్థం కాలేదు. కన్నవాళ్ళు కట్టుకున్న వాడు దూరమై ఒంటరిగా పాపతో ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలియక అనాధలా మారింది అమృత.

– భవ్యచారు

ఎవరు పార్ట్ 3 Previous post ఎవరు పార్ట్ 3
మిత్రుడు Next post మిత్రుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *