తెలుగు నా మాతృభాష

తెలుగు నా మాతృభాష

దేశభాషలందు తెలుగు లెస్స అని ఆనాడే అన్నారు
మాతృభాష మకరందం
మరువలేని ఆనందం
అమ్మఒడి లోనూ
గురువు బడిలోను
అంతే గొప్పది మన భాష
ఆత్మీయ భాష అంటే తెలుగు
అచ్చులతో కుదురుకున్న
అలరించే మన భాష
తెలుగు
అర్థమైన హాస్యమైనా
అనుకరిస్తూ సాటిలేనిది
మన తెలుగు భాష
సంస్కృతి అయినా
సాంప్రదాయమైన
చెప్పకనే చెబుతోంది
అదే మన తెలుగు  భాష
పలుకు పలుకున
తీయని పరిమళం
అదే మన అద్వితీయ
తెలుగు భాష
మన భావన తెలిపే
సహ భావం కలిపే
అమ్మ భాష
అదే మన తెలుగు భాష
సాటిలేని భాషను
శ్వాసగా నిలుపుకో
తెలుగు భాష గొప్పతనం
జగమెల్లా  చాటుకో!
– జి. జయ

Related Posts