వెన్నెల్లో వెన్నముద్ద…

వెన్నెల్లో వెన్నముద్ద

ఆ పాత రోజులే వేరండీ.
వెన్నెల రాత్రుల్లో అమ్మలు
వెన్నముద్ద కలిపిన అన్నం
పిల్లలకు పెడుతుంటే చాలా
ఆనందంగా ఉండేది. ఒకే
ప్లేటులో ఇంట్లో పిల్లందరికీ కలిపి అన్నం పెట్టే ఆ తల్లుల
అమృత స్పర్శ వల్ల ఆ అన్నం
అమృతమైపోయేది. ఇప్పుడు
ఉన్న రుచికరమైన పదార్థాలు
ఏవీ కూడా ఆ రుచికి సరితూగేవి కావు. ఆ ప్రేమలు
ఇప్పుడు లేవు. ఆ ఆప్యాయతలు ఇప్పుడు లేవు. చందమామను చూపించి పాల
బువ్వ పెట్టే అమ్మలు ఇప్పుడు
ఎంతమంది ఉన్నారు. పిల్లలకు
సెల్ఫోన్ ఇచ్చేసి,టీవీ చూపించి
అన్నం పెడుతున్నారు. వారేమి
తింటున్నారో పిల్లలకే తెలియదు. రోజులు మారాయి.
మళ్ళీ పాతరోజులు రావాలి
అని కోరుకుందాం.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *