ఒకరోజు నాకు రాత్రి నిద్ర పట్టక పోయేసరికి అటు ఇటు తిరుగుతుండగా…చప్పుడు

శీర్షిక:⁠- చప్పుడు

ఒకరోజు నాకు రాత్రి నిద్ర పట్టక పోయేసరికి అటు ఇటు తిరుగుతుండగా కొద్దిగా దూరంగా మెల్లగా గజ్జల సౌండ్ వినిపించింది. అటువైపు చూడగా ఆ గజ్జల సౌండ్ ఆగిపోయింది.

మళ్లీ అలాగే అటు ఇటు తిరుగుతూ ఉండగా గజ్జల సౌండ్ వచ్చిన కూడా పట్టించుకోకుండా నా మట్టుకు నేను పాటలు వింటుండగా సడన్గా ఎవరితో అమ్మాయిది అరుపు వినిపించింది.

కొంచెం భయంతో అరుపు వినిపించిన వైపు వెళ్తుండగా నా వెనకాల నుంచి గజ్జల సౌండ్ మెల్లగా వినిపిస్తుంది.

మెల్లగా వెనక్కి తిరుగుతుండగా ఇటు వైపు నుంచి ఆ అమ్మాయి అరుపు ఇంక గట్టిగా వినిపిస్తుంది.
నాకు అప్పటికే కాళ్ళు చేతులు వణుకుతునే ఉన్నాయి.

ఆ భయంతో నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది.
మళ్లీ నా వెనకాల నుంచి గజ్జల సౌండ్ ముందు మెల్లగా వినిపించిన తర్వాత గట్టిగా వినిపించింది ఆ భయంతో నేను అక్కడ ఉండలేక లోపలికి పరుగు పెట్టాను.
ఆ చీకట్లో మా నాన్నను చూసి గట్టిగా అరిచాను.

అదంతా చూసిన మా చెల్లి వచ్చి ,
“ఎందుకే భయపడుతున్నావ్ అది ఎవరో కాదు?”  నాన్న అని చెప్పింది.
నవ్వుతూ “నాన్న నువ్వా?” అని అడిగి నా రూమ్ లోకి వెళ్ళిపోయాను.

రాత్రంతా పిచ్చి పిచ్చి కలలు రావడం వల్ల నాకు అసలు నిద్ర పట్టలేదు. ఉదయం పది గంటలకు ఒక పార్టీ వాళ్లు ప్రచారం చేసుకుంటూ మా గల్లీలోకి వచ్చారు.

వాళ్లు కొట్టే బ్యాండ్ చప్పుడికి భయంతో నిద్ర లేచాను. నా చెల్లెలు భయపెట్టాలని దుప్పటి ముసుగు వేసుకొని నన్ను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుండగా నేను సడన్గా లేచేసరికి తను పరుగున బయటకి పారిపోయింది.

అప్పుడు అర్థమైంది బయట ప్రచారం చేసే వాళ్ళు బ్యాండ్ చప్పుడు అని.
వాళ్ళు చేసే బ్యాండ్ చప్పుడుకి నాకు ప్రతి ప్రతిధ్వని లాగా వినిపించింది.
“అక్క… నీకు నిన్న రాత్రి నిద్ర పట్టలేదు అని బయటకు వచ్చావ్ కదా. నీకు గజ్జల సౌండ్ వినించింది ఎవరిది కాదు నా పట్టిల సౌండ్.

మా వెనక ఇంటి వాళ్ళు హారన్ సినిమా చూస్తుండగా ఆ అరుపులు ఆ సినిమాలోనివి” అని నవ్వుతూ చెప్పింది.

“దానికి నేను ఎదో దెయ్యం ఉంది అనుకుని తెగ భయపడిపోయి” అని కోపంగా చెప్పాను.
“నీ పట్టీల సౌండ్ వల్ల నిన్న రాత్రి నాకు అసలు నిద్రే కరువయ్యింది. ఇంతంతా నీ వల్లే కొట్టడానికి చెల్లి మీదకు వెళుతుండగా” అది పారిపోయింది.

అమ్మ వచ్చి ,
“ఇంత ఆలస్యంగా నిద్ర లేసే ఎప్పుడు గుడికి వెళ్లి రావాలని వెళ్లి తోందరంగా తయారు అవ్వు” అని చెప్పగానే వెళ్లిపోయాను.
అందరం కలిసి గుడికి వెళ్ళాము..

మాధవి కాళ్ల.

telugu stories books

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *