అదే మనుషుల లోకం కావాలని…

అదే మనుషుల లోకం కావాలని…!!!

ఆకారంలేని విలాసాల వికృతులతో
పూయని ముఖచిత్రాన్ని మనిషిగా
చూపించుకోలేక…గుండెలు నింపని
పదార్థాలతో ఒరవని సందేశాలు
అంతుచిక్కని రహస్యాలని…తెలుపని
మనస్సును తెగగొడుతు ఒడిసెల రాయిగా
దూరాలకు విసరివేయకు…

బతుకై మోయరాదు రాగద్వేషపు
లాలసనల తారతమ్యాలను…
భయమంటే నేర్పని సంఘానికి
ఆరోగ్యవంతుడవై అందరి హృదయాలలో
చెదరని ముద్రను వేస్తు…తలుపు తట్టిన
విజయోత్సవాన్ని నువు నడిచే దారులలో
ప్రగతి సూర్యోదయంగా నడిపించు…

దాన్యం కొలిచేది దానం చేసేది…
వెతికిన మనుషులకు వేదికవవుతు
శాస్త్రీయ భావాలతో సాంకేతిక
లోపాలను రూపుమాపుతు…
నువ్వంటే ఒక లోకం కాదని….
నిజాల గుప్పిటిలో పదాల కవితవై
వర్ణించబడుతు…చిహ్నమై చిగురిస్తు
అజ్ఞానమనే నేలముసుగును తొలగించు…

ఉరిమే ఉరుములు
మెరిసే మెరుపులు నింగి నొదలిన
భయాలు కావు…తొలకరి చినుకుల తీర్పును ఏరువాకగా పారించే ప్రయత్నమది…
కుదుట పరిచే పలకరింపువై పచ్ఛధనాల
ప్రకృతి చేతనని ఆస్వాధిస్తు…
వికసించే లతల విధేయతలతో సమాజానికి
రూపకర్తవై…విషయాల సంరంబంలో
విశ్వసమైక్యత కొరకు నీదొక చేయని
కలుపుతు అదే మనుషుల లోకం కావాలని
కోరుకో…

దేరంగుల భైరవ

telugu stories for kids

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *