"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

నీటి కష్టాలు..

నీటి కష్టాలు..

మేము ఇది వరకు ఉన్న దగ్గర మాకు నీళ్లు వచ్చేవి కావు..
అవన్నీ క్వాటర్లు ..

మెుదట్లో బాగానే ఉన్నా తరువాత తరువాత తక్కువ నీరు వదిలే వారు..
ఎందుకంటే ఎక్కువ మంది కావడం క్వాటర్లు లేని వారి కొన్ని ఇల్లు లు కట్టుకోవడంతో ఈ నీళ్ల పైపులకే కనెక్షన్లు పెట్టుకోవడంతో క్వాటర్ల వారికి నీళ్లు తర్కువై పోయాయి అందులో మాకిచ్చిన కనెక్షన్ ఎత్తు పైన ఉందని కింద గుంట తవ్వించారు అప్పుడు కొంచం వచ్చినా రాను రాను అవి కూడా తగ్గి పోయాయి..

ఎన్నో ధర్నాలు చేసాం! జి ఎమ్ గారితో ఫ్ైటింగ్ చేసాం!

మా ఒక్క క్వాటరుకు ఏమీ చేయలేక చేసినా ప్రయత్నాలు ఫలించక వేరే ఇంట్లోకి మారమని సలహా ఇచ్చారు..

కానీ మేమా క్వాటరుకు రెండు రూములు ఎక్కువ కట్టుకున్నాం పెట్టుబడి పెట్టి పైగా ఆ ఇళ్లంటే మా అందరికీ చాలా ఇష్టం..

ఎందుకంటే జామ చెట్లు,సీతా ఫలాలు,నిమ్మ రేగు మామిడి అరటి ఇలా అన్ని పండ్ల చెట్లు కూరగాయల చెట్లు రకరకాల పూల చెట్లు అన్నీ పెట్టుకున్నాం! కాయలు పండ్లు పూలు అన్నీ వస్తుంటే వదిలి ఎలా వెళ్తాం?

నీళ్లే లేవంటుంది ఇన్ని చెట్లెలా పెంచారనుకుంటున్నారు కదూ!
పాపం మా చెట్లు బట్టలు పిండిన నీళ్లు కూరగాయలు కడిగిన నీళ్లు
ఇలాంటి పిచ్చి నీళ్లు త్రాగే బతికేవండి..

మేమే గుడిసెలు కట్టుకున్న వాల్ల దగ్గరి నుండి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది అప్పుడప్పుడు..
కాకపోతే మా పనమ్మాయి తెచ్చేది…

ఇలాగే బిందె మీద బిందె పెట్టుకుని తెస్తుండె..
ఈ చిత్రం చూడగానే మా నీటి కష్టాలు గుర్తొచ్చాయి..
మీతో పంచుకున్నా!!

ఉమాదేవి ఎర్రం

telugu stories in telangana

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *