తీపి జ్ఞాపకాలు

తీపి జ్ఞాపకాలు

గడచిన మధుర క్షణాలు
అన్నీ తీపి జ్ఞాపకాలు
వీడను అంటున్నాయి
పదే పదే

తలచుకుంటే చిన్నపిల్లల
మవుతాము మరీ మరీ
వస్తాయి ఆనంద భాష్పాలు
పుట్టిన ఊరుతో అనుబంధం
పెరిగిన చోటుతో పెనవేసిన
తీపి జ్ఞాపకం.
పలకరింపు లో పరిమళం
ప్రాణ మిచ్చే ఆత్మీయత
తీపి జ్ఞాపకం.
చిన్ననాడు ఆడుకున్న ఆటల్లో కొత్త బట్టల్లో
తీపి జ్ఞాపకం.
తిరుగుతూ తిన్నచిరుతిళ్ళు
తిరిగిన చోటుల్లో తీపిజ్ఞాపకం
కొంటె పనుల కోలాహలం
పండుగల సందడులు
పంచుకున్న ఆనందాలు
తీపి జ్ఞాపకం.
చదివిన రోజులు
పనిచేసిన కార్యాలయం
తీపి జ్ఞాపకం.
తిరగేసి న పాత ఫోటోలు
అనుభూతుల సమాహారం
తీపి జ్ఞాపకం.
బెంగ లేని రోజులు
బెదిరించే పెద్దవాళ్ళు
తీపి జ్ఞాపకం.
ఫీజులు లేని చదువులు
బాల్య మిత్రుల ముచ్చటలు
తీపి జ్ఞాపకం.
పరీక్షల ఫలితాలు పేపర్లో
పట్టరాని సంతోషం మదిలో
తీపి జ్ఞాపకం.
వెన్నెల్లో ఆటలు వెలకట్టని
రోజులు తీపి జ్ఞాపకం?
సెలవుల్లో బంధాలు
సేద తీరే అవకాశం
తీపి జ్ఞాపకం.
అమ్మకొంగు చాటునజీవనం
వీడ నంటవి ఎప్పటికీ
తీపి జ్ఞాపకం.
ఫార్ములా లేని జీవనం
పంతమే లేని పయనం
తీపి జ్ఞాపకాల గంపలో
వీడకుండా నిండివున్నవి
పదిలంగా మది మదిలో
నిండుగా అమ్మాఅనికమ్మని
పిలుపు సాక్షిగా ……?

– జి జయ

Related Posts