తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

పల్లవి

శేషాద్రి కొండపై కొలువైనవాడా
కళ్ళేమో కలువలై వేచి ఉన్నాయి
కన్నీరు కాలువై పారుతున్నాది
మనసేమో నీకై వెతుకుతున్నాది

చరణం
నీ దివ్య రూపమును కనినంత చాలు
నీ భవ్యనామమ్ము పలికితే మేలు
తుళ్లిపడుతూ గుండె
కీర్తనగ ఉప్పొంగు

చరణం
బంగారు వాకిలిలో నవ్వుతుంటావు
బతుకింక నీదని మురిసిపోతుంటాము
బాధలు బాధ్యతలు నీవంచు తలచి
నీ బాట నీ మాట మాదనుచు సాగేము

చరణం
నీ నవ్వు మా స్ఫూర్తి
నీ చూపు మా కీర్తి
నినుచూడ వచ్చేలా
ఏడుకొండలెక్కేలా
వరమీయవయ్యా మా శ్రీనివాసా

చరణం
నినుచూసినంతనే మాటేమో రాదు
నీ తలపుతోనే దినమంత గడుచు
నీ పిలుపుకై మేము వేచేము స్వామి
నిన్నెపుడు వీడము ఇది మా హామీ

– సి. యస్. రాంబాబు

Related Posts