తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

పల్లవి
జగమేలు స్వామికి జయమంగళం
కోనేటిరాయుడికి అభివందనం
నినుచూడ కదిలేరు జనులందరు
కృపచూపి కరుణించి కాపాడమనుచు

చరణం
కోరికలు కష్టాలు వెంటున్నా
వేడుకను చేసేవు నీవంట
మావెంట నీవుంటే చాలంట
అదియే సంబరము మాకంట

చరణం
నీ నామ స్మరణే చేయగా మేము
మేనంత పులకించి మురియదా స్వామి
మా పుణ్యఫలము నీవేను అనుచు
ఏడుకొండల నెక్కుతాము

చరణం
భూదేవి శ్రీదేవి తోడుగా నీవు
భువనైకమూర్తివైనావు
నీ సన్నిధానమ్ము మాకూ
ఇలలోన వైకుంఠమయ్యా

చరణం
ఇహము పరము మరిచి
నిను కొలుచు భాగ్యమే మాది
రేపుందో లేదో కానీ
నీ ఉనికి మాత్రం సత్యం

– సి. యస్.రాంబాబు

Related Posts