తిరుమల గీతావళి
పల్లవి
శ్రీహరినామము తలిచెదము
ముక్తిబాటన నడిచెదము
శ్రీనివాసుని కొలిచెదము
కోరిన కోర్కెలు తీరును
చరణం
కోనేటిరాయుడు అండగ ఉంటే
ఏ భయము ఇక చేరదు
తన చిరునవ్వొకటే చాలును కాదా
తలపుల తోటే విరియును చూడు
చరణం
తిరుమల క్షేత్రము ఇలలో స్వర్గము
శ్రీనివాసుడే మన సర్వముగా
పగలు రేయి తననే తలచిన
మనసుకు శాంతి.. కనులకు కాంతి
చరణం
తన దర్శనమే దొరకలేదని
దిగులే వలదు..చింతే పడకు
గోవిందాయని పలికితిమంటే
కలలోనయినా కరుణిస్తాడు
చరణం
తన భక్తులను కాపాడేందుకు
వెలసిన దైవము శ్రీనివాసుడు
ఆపదమొక్కులు తీర్చేవాడిని
వేడినచాలును..వేడుకచేయును
– సి.యస్.రాంబాబు