తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

పల్లవి
నీ నీడొకటే చాలును దేవా
నీ తోడొకటే కానుక దేవా
కాలం వాకిట నిలిచిన మాకు
అండా దండా అన్నీ నీవే

చరణం
నీ దర్శనమే దొరకని మాకు
నీ స్మరణొకటే మిగిలెను చూడు
మాటలు రాని భావము మాది
ఎల్లలు లేని భక్తిని చూడు

చరణం
జీవము నీవని జీవిక నీవని
నమ్మినవారము మేమందరము
నీ దయకోసం నిరతము వెతికే
అల్పులమయ్యా కాపాడయ్యా

చరణం
ఆపదలొస్తే నిను చూసెదము
పదములు కట్టి పాడెదమయ్యా
కలతలు వస్తే కొలిచెదమయ్యా
గోవిందాయని పిలిచెదమయ్యా

చరణం
కొండలపైన కొలువున్నావు
హృదయము నీదే గైకొనవయ్యా
నీ చిరునవ్వొకటే చింతలు తీర్చు
నీ చూపొకటే కలలను చూపు

– సి. యస్. రాంబాబు

జీవనశకటం Previous post జీవనశకటం
జీవిత గమ్యం చేరాలంటే (పిల్లల కోసం) Next post జీవిత గమ్యం చేరాలంటే (పిల్లల కోసం)

One thought on “తిరుమల గీతావళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close