"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

పల్లవి
దయ చూపవయా గోవిందా
కానరాదయా ఏ దారీ
నీవే సర్వం మాకయ్యా
మా బతుకును తీర్చగ రావయ్యా

చరణం
నిను చూసినచో పరవశము
నీ వశమయ్యెను మా మనసు
మోహాలన్నీ పోయినవీ
మోసాలన్నీ వీడితిమి

చరణం
మా నీడవుగా నిలవమని
మా తోడువుగా నీవనుచు
నీ నామమునే పలికితిమి
అనుభూతులనే చిలికితిమి

చరణం
చిలిపిదనాల నీ నవ్వు
ఎదలోమోగెను వీణియగా
ఎన్ని గురుతులు నీవయ్యా
మము బ్రోవగ నువు రావయ్యా

చరణం
రాగాలెన్నో వేడెనుగా
నిను కీర్తించెను కానుకగా
కాలాలన్నీ దోసిలి పట్టెను
పాటొకటేమో నాలో పుట్టెను

– సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *