తిరుమల గీతావళి-2

తిరుమల గీతావళి-2

*పల్లవి*
శ్రీనివాసుని నమ్మితిమంటే
భయమే ఉండదు అండే ఉండును
శ్రీనివాసుని కొలిచితిమంటే
కోరినవన్నీ తీర్చును తాను

*చరణం*
ఏడుకొండలు ఎక్కితిమంటే
మనసంతా సంతోషము కాదా
రేపటి చింతే అసలే ఉండదు
కడపటివరకు తన ధ్యాసేగా

*చరణం*
క్షణభంగురమే జీవితమన్నది
దైవచింతనే దారిచూపుగా
శ్రీనివాసుని తలచితిమంటే
ధైర్యముతోటి సాగుదువయ్యా

*చరణం*
తన తలపేగా మనకో పిలుపు
తన స్మరణేగా చివరకు మిగులు
తన దర్శనమే మనకో వేడుక
తన చిరునవ్వే మనకో పండుగ

– సి.యస్.రాంబాబు

Related Posts