తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

పల్లవి
ఎంతగ వేడితే అంతటి కరుణను
చూపేవాడవు నీవు
నమ్మకముంటే దారిని చూపే స్వామివి నీవే కాదా

చరణం
బాటను విడచి బాధ్యత మరచి
ఐహిక సుఖమే ఒకటే చాలని
తలచితిమయ్యా తప్పేనయ్యా
తప్పదు నీకు మార్గము చూపగ

చరణం
తనివేతీరదు ఆకలి ఉండదు
నిను దర్శించిన మాకు
నీ నామముతో బతుకే మారును
నీ చిరునవ్వును ఎదలో నింపి సాగెదమయ్యా మేము

చరణం
బంధాలన్నీ ఛేదించుకుని
నిను వెతికెదము మేము
సాయము చేసి మార్గము చూపి
కరుణించవయా స్వామి

– సీ.యస్.రాంబాబు

Related Posts