తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

పల్లవి
నిను చూడాలని
నిను చేరాలని
మనసే కోరెనుగా
కోరిక తీరదుగా

చరణం
కొండంత దూరంలో
కొలువైవున్నావు
మామీద దయచూపి
దర్శనమీయవయా
తనువేమో తలచింది
మనసేమో పిలిచింది
దారేమో కనపడక
దండాలు పెట్టేము

చరణం
దారేమో కనపడదు
నిన్ను నమ్మకున్నాము
నీనీడ మాకుంటే
మా వెంట ఉన్నట్టే
నిను చూడని బతుకున
అన్నీ లోటేగా
మాకేమో చేటేగా
గోవింద అనకుంటే

చరణం
భక్తితో పిలిచేము
ఆర్తితో కొలిచేము
మనవీ వినవయ్యా
అలకే మానవయా
ఏడుకొండలు ఎక్కే
కిటుకేదొ చెప్పవయా
నిను చూసే భాగ్యము
చూపగా రావయా

– సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress