తిరుమల గీతావళి
పల్లవి
నీ నీడ మాకు కాసేను ఎండ
నీ తోడు మాకు మల్లెపూల దండా
నీ అండా దండా మాకు పెద్ద కొండా
నీ తలపే మాకు మనసంతా నిండా
చరణం
నీ చూపు మాకు చుక్కాని కాదా
కష్టాలు కన్నీరుకు చుక్కెదురే కాగా
కదిలేము మేము నిను కొలిచేము స్వామీ
ఏడుకొండలనే హత్తుకుంటాము
చరణం
ఆనందనిలయా ఆపదలను కాయా
కదలి రావయ్యా..సప్తగిరుల సాక్షిగా
నీ తలపే పిలుపై మాలోన వెలిగే
అలుపన్నది లేదు నిను తలచితిమంటే
చరణం
నిను చూడరాలేము
నిను విడిచి ఉండలేము
నీవే మా ప్రాణం..నీ పలుకే మా ధ్యానం
మము విడువకు స్వామి
మము మరువకు దేవా
-సి.యస్.రాంబాబు
Bagundhi 👌👌🙏💐