తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

పల్లవి
గోవింద నామము
కలత తీర్చును
కొండంత వెలుగై దారి చూపును
వినవే మనసా..పద పదవే మనసా..

చరణం
ఏడుకొండలు శ్రీహరి ధ్యానము చేయుచుండగా
అది తెలిసి మనము శ్రీనివాసుని వేడుకొందము
సకల భువనాలను రక్షించువాడు
మన శ్రీనివాసుడు
అండ పిండ బ్రహ్మాండమందున
అగుపించువాడు
వైకుంఠమొదలి వచ్చినవాడు
మన అందరినీ మెచ్చినవాడు
తన నామమునే పలికెదమండీ
ముక్తి మార్గమే చూపును మనకు

చరణం
హరికొలువులోన చేరితే మనము
ధన్యులమయ్యే వరమే దొరుకు
దోపిడి జగతిన శ్రీనివాసుడే
వెంటే ఉండి కాపాడునుగా
సాధ్యము కానిది లేనేలేదు
శ్రీహరి మార్గము నడచినవారికి
వినవే మనసా ఓపికతోటి
గోవింద నామము గమ్యము కొరకు

 

-సి.యస్.రాంబాబు

మహాశక్తి Previous post మహాశక్తి
వివర్ణం Next post వివర్ణం

One thought on “తిరుమల గీతావళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close