తోడు

తోడు

తోడు

ఒంటరి జీవితం చాలా కష్టంగా ఉంది.ఎవరైనా తోడు గా దొరికితే బాగుండు అలా అను కోవడం చక్రపాణి కి ప్రతిరోజూ అలవాటే, కానీ ఎవరా తోడు ఎక్కడ దొరుకుతారు అనేది మాత్రం అతనికి తెలియదు.

పోనీ రెండో పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరో లో పేరు నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ వయసులో తనకు పిల్ల దొరుకుతుందా అనే ఆలోచన తో అందులో నమాధు చేసుకోలేదు తెలిసిన వాళ్ళు వెక్కిరిస్తారు అనే ఉద్దేశ్యంతో వెనకడుగు వేశారు.

అయితే చక్రపాణి కి వందల కోట్ల ఆస్తి పాస్తులు ఉండడం వల్ల అతను ఎవర్ని ఎక్కువ నమ్మడు కాబట్టి ఎవరు ఎలాంటి వాల్లో అనే సందేహం తో కూడా పెళ్లి చేసుకోవడానికి భయపడుతూ ఉంటాడు.

వచ్చిన ఆవిడ బాగా చూస్తుందో లేదో డబ్బు కోసం ఆశ పడి తనను ఏ రాత్రి అయినా చంపేస్తుంది ఏమో అని రకరకాల భయం వల్ల పెళ్లి చేసుకోకుండా నే ఉండి పోయాడు. కొన్నాళ్ళు బాగానే ఉన్నా ,తర్వాత తర్వాత అతన్ని ఒంటరితనం అవరించింది.

ఇంత సంపాదించింది ఎందుకు నా వాళ్లు అంటూ ఎవరూ లేరు, ఇంకెవరి కోసం నేను సంపాదించాలి అనే విరక్తి ఓ వైపు, నాకెవరూ లేరనే బాధ ఓ వైపు తో పూర్తిగా వైరాగ్యం లోకి వెళ్ళాడు. అన్నిటి పై అతనికి విరక్తి భావం కలిగింది.

ఒక రోజు అర్ధరాత్రి చక్రపాణి కి సడెన్ గా మెలకువ వచ్చింది. ఆ నిద్ర మత్తులో తాను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో నడుచుకుంటూ బీచ్ వైపు వెళ్ళాడు. నిజానికి అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన లేదు. కానీ కాళ్ళు మాత్రం బీచ్ వైపు అడుగులు వేశాడు.

అలా బీచ్ లోకి వెళ్తున్నాడు ముందు కాళ్ళకి చల్లగా నీళ్లు తగిలాయి.కానీ అవేవీ అతనిని కదిలించ లేకపోయాయి.అతను అలా నీళ్లలోకి వెళ్తూనే ఉన్నాడు. అలా వెళ్ళడం వల్ల తన మనసుకు, శరీరానికి ఎంతో ప్రశాంతంగా అనిపించింది.

అలా నడుస్తూ నడుస్తూ బీచ్ మధ్యలోకి వచ్చాడు.ఇంకాస్త దూరం వెళ్తే చాలు ఇక అతను మునిగి పోయి చనిపోయే లా ఉన్నాడు.. అయిన మొండిగా వెళ్తూనే ఉన్నాడు.అతని మనసులో ఎలాంటి ఉద్దేశ్యం లేదు కానీ ఎవరో లాగినట్టు గా వెళ్తూనే ఉన్నాడు..

ఇంకాసేపు అయితే అతను మునిగి పోతాడు.ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ , ఎన్నో కోట్లకు అధిపతి అతను,అతని దగ్గర వందల మంది ఉపాధి పొందుతున్నారు.అలాంటిది అతనీ అర్ధరాత్రి అలా నీళ్లలో జల సమాధి అవబోతున్నాడు. అతను ఇంకా ముందుకు వెళ్తున్నాడు ఇంకొక్క అడుగు వేస్తే చాలు అతను సముద్ర గర్భం లో చేరిపోయి ,చనిపోయి తెల్లారి వార్తల్లో ఒక వార్త గా మిగిలి పోతాడు.

ఇంతలో ఏదో ఒక గట్టి తాడు అతని నడుము చుట్టూ పెనవేసుకుంది.అతన్ని శక్తి మేర ఆ తాడు ను లాగుతున్నారు ఎవరో, చివరికి అలా లాగి లాగి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే చక్రపాణి నీళ్లు మొత్తం తాగేసి,అపస్మారక స్థితిలో ఉన్నాడు.

రెండు రోజుల తర్వాత అతనికి సృహ వచ్చింది. అతను చుట్టూ చూసాడు.అదొక చిన్న పూరి పాక లా అనిపించింది నేనెందుకు ఇక్కడ ఉన్నాను అనుకుంటూ గబుక్కున లేవబోయాడు. కానీ శరీరం సహకరించ లేదు.

ఆ ఆ ఆగండి మీరు లేవకండి మీకేం కావాలో చెప్తే నేను తెస్తాను అంటూ ఒక మృదు మధుర కంఠం పలికింది. ఆ కంఠం వచ్చిన వైపు చూసాడు.అక్కడ నిగ నిగ లాడుతూ ,నల్లని విగ్రహం తో ,నుదుటిన బొట్టు లేకుండా ఒకావిడ నిలబడి కనిపించింది.దాంతో మీరెవరు అంటూ అడిగాడు.

నేనా నేను చేపలు పట్టుకుని జీవించే ఒక జలారిని నేను వేట కి వెళ్లి వస్తుంటే మీరు నీళ్లలో మునిగి పోవడం చూసాను.అందుకే మిమల్ని కాపాడాను. మనిషి జీవితం చాలా చిన్నది. అందులో కష్టాలు ఉంటాయి,సుఖాలు ఉంటాయి అంత మాత్రాన చావే పరిష్కారం కాదు .ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ లభించదు.దాన్ని మీరు అర్ధాంతరంగా చాలించాలి అని అనుకుంటున్నారు.

మమల్ని చూడండి మేము రోజు సముద్రం లోకి వెళ్తే తప్ప మా ఆకలి తీరదు. అయినా బ్రతకడానికి వెళ్ళాలి .వేట కి వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తెగించి వెళ్తాం.

మీకు అన్ని విధాల ఉండగా కూడా చావలని అనుకుంటున్నారు.దీనికి కారణం ఏమిటి అంది. చక్రపాణి దానికి కారణం అంటూ ఏమీ లేదు. నాకు అన్ని ఉన్నాయి కానీ నన్ను అర్ధం చేసుకుని నా వాళ్ళు అనుకునే వాళ్లు ఎవరు లేరు అన్నాడు కాస్త నా మనసు విప్పి మాట్లాడింది నీతోనే ,నా చుట్టూ ఉన్నవాళ్లు నా అస్తి కోసం తప్ప నా గురించి ఆలోచించే వారు ఎవరూ లేరు అంటూ చేతుల్లో మొహాన్ని దాచుకుని వెక్కెక్కి ఏడవడం మొదలు పెట్టారు.

దానికి ఆవిడ అలా ఎందుకు అనుకుంటారు. ప్రక్తితి మాత ఎవరి కోసం పుట్టదు.ఎవరో చూస్తారు అని పువ్వులు పూయాదు. కాబట్టి మీరు ఒంటరి కాదు. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ బాగోగులు చూసుకుంటాను.నాకు ఎవరూ లేరు.నేను ఒంటరినే . ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి ఇప్పటి నుండి నేను మీకు తోడు,మీరు నాకు తోడు.నాకు మీ అస్తి లో వాట అవసరం లేదు. మిమల్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది అంటూ చెప్పేసరికి ,అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఇంత మంచి అమ్మాయి అన్ని వదిలేసి నా కోసం నా గురించి వస్తాను అంటుంది. నిస్వార్ధంగా సేవ చేస్తా అంటుంది.ఇందులో తప్పేం లేదు అని అనుకుంటూ వెళ్లి ఆవిడ చెయ్యి పట్టుకుని నిజంగా జీవితాంతం నా తోడు ఉంటావా అన్నాడు. ఆవిడ కళ్ళ తోనే సమాధానం చెప్పింది.

అతను ఆమె చేతిలో చెయ్యి వేసుకుని బయలు దేరారు. ఒకరికొకరు తోడుగా నీడగా చనిపోయే వరకు కలిసే ఉన్నారు.

ప్రపంచం లో ఏ ఒక్కరూ ఒంటరి కాదు. దేనికైనా సమయం రావాలి.అప్పుడే మన భాగస్వామి ఎవరో మన మనసుకు తెలుస్తుంది.వారిని అసలు ఒదులు కోకూడదు.

 

-భవ్యచారు

 

నాన్న Previous post నాన్న
కొత్త శీర్షిక Next post కొత్త శీర్షిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close