తోడు-నీడ
మన తోడు- నీడ మన జీవిత భాగస్వామి.
పెళ్ళి అవక ముందు ఒక రకమైన జీవితం
పెళ్ళి అయ్యాక ఒక రకమైన
జీవితం గడుపుతాము. పెళ్ళి అవకముందు
ఏ విధమైన బాదరబందీ లేని
జీవితం గడిపేవారు కూడా పెళ్లి
అయ్యాక చాలా బాధ్యతగా
ఉంటారు. ఒకసారి జీవిత
భాగస్వామి జీవితంలోకి వస్తే
వారే జీవితాంతం మన తోడు-
నీడగా ఉండేవారు. రాత్రి పూట
మన నీడైనా మనని విడిచిపెడుతుందేమో కానీ
మన జీవిత భాగస్వామి మనల్ని వదిలి వెళ్ళరు.
చావు కూడా వారిని విడదీయలేదు.
ఇద్దరూ కలిసి ఉన్న జ్ఞాపకాలు హృదయంలో
నింపుకుని ఆ జ్ఞాపకాల నీడలో
జీవితాన్ని గడిపేసే ఒంటరి పక్షులు ఎందరో.
-వెంకట భానుప్రసాద్ చలసాని