తొక్క లేని పిట్ట
తొక్క లేని పిట్ట 90 ఊర్లు తిరిగిందట
రెడ్ బాక్స్ ఉదయం అట
గ్రీన్ బాక్స్ రాత్రి అట
నిరంతర ప్రక్రియ అట
ఉత్తరాల నిరూపణ అట
మనసులోని భావాలకు నిదర్శనం
పూర్వం పావురాలు అట
నేడు ఎండొచ్చిన వానొచ్చినా తడవద్దు అట
ఉత్తరాల పెట్టే
మరణమైన
జననమైన
ఏ సంగతి అయినా
భలే స్పీడ్గా పోతుంది
జవాబు ఇచ్చి నిలుచుంటుంది
అందుకే అన్నారు పోస్ట్మాన్ సహకారి
ఎండ అనగా
వాననక
పగలనకా
రాత్రునక
చలి అనక
జాము రేయ ఎనక
రాసే ఉత్తరాలను
భద్రపరుస్తూ ఉంటుంది
నిజంగా పోస్ట్ బాక్స్
అన్నదమ్ములు లాంటివి
చెరొకరు ఒక్కో విధంగా
ఉపయోగపడడమే గాంచు
– యడ్ల శ్రీనివాసరావు